Twitter war : సంక్రాంతి పండుగ అతిపెద్ద బాక్సాఫీస్ ఘర్షణలకు సాక్షిగా నిలుస్తుంది. పండుగ వేళ పెద్ద పెద్ద స్టార్ ల మూవీలు విడుదలకు సిద్ధమయ్యాయి. తమిళ హీరో విజయ్ నటించిన వారీసు అజిత్ నటించిన తునివు సినిమాలో ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రెండూ ఒకేరోజు విడుదల కానుండటంతో ఈ పండుగ రోజు ప్రేక్షకులకు డబుల్ ఫీస్ట్ వచ్చినట్లవుతోంది. అయితే ఇంకా సినిమాలు విడుదల కాకముందే ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార మొదలైంది. దిల్ రాజు చేసిన హాట్ కామెంట్స్‌తో తమిళ తంబీలు ట్విట్టర్ లో ఓ రేంజ్ వారే చేస్తున్నారు.

తమిళనాడులో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని నిర్మాత దిల్ రాజు ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వారీసు నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తునివుతో జరిగిన గొడవపై విరుచుకుపడ్డారు. ఈ గొడవ గురించి ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని అన్నారు. అందువల్ల, అతని చిత్రం తునివు కంటే ఎక్కువ స్క్రీన్‌లను పొందేందుకు అర్హమైనదని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమిళనాడులో నా సినిమాతో పాటు అజిత్ సర్ సినిమా కూడా విడుదలవుతోందని తెలిపారు. విజయ్ సర్ తమిళనాడులో నెంబర్ వన్ స్టార్ అన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 800 స్క్రీన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సమానంగా స్క్రీన్లు వస్తున్నాయి. విజయ్ సార్ అజిత్ కంటే పెద్ద స్టార్ కాబట్టి నా సినిమా కోసం కనీసం 50 అదనపు స్క్రీన్‌లు కావాలని నేను అక్షరాలా రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

దిల్ రాజు ఇంటర్వ్యూ చూసిన తమిళ తంబీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. అనవసరంగా మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అయిన విజయ్ , అజిత్ ల మధ్య అభిమానుల గొడవను సృష్టిస్తున్నారని కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేశారు. మరొక అభిమాని విజయ్ పెద్ద స్టార్ అయితే, అతని సినిమాకు ఆటోమేటిక్‌గా అదనపు స్క్రీన్‌లు ఇవ్వాలి కదా అని పేర్కొన్నాడు.
వారీసు, తునివు రెండూ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విజయ్, రష్మిక మందన్నతో కలిసి నటించిన వారిసు చిత్రం తమిళం ,తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడింది. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో డైరెక్ట్ గా విజయ్ మొదటి సారి అరంగేట్రం చేస్తున్నారు. మరోవైపు భారీ అంచనాల మధ్య తునివు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మంజు వారియర్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అజిత్ తొలిసారిగా విఘ్నేష్ శివన్‌తో జతకట్టనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.