Thank You movie : ఇటీవల సక్సెస్‌ను ఇంటి పేరుగా మలుచుకున్న హీరో అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం థాంక్యూ నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా మాళవిక నాయర్, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించారు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలనైతే భారీగానే పెంచేసింది. అటు యూఎస్‌లో మూవీ రిలీజవగా.. ఇటు ఇండియాలోనూ విడుదలకి కొన్ని గంటల ముందే ఏపీలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.
Thank You movie : పోకిరి కటౌట్ ట్విస్ట్ అదిరిపోయింది..
మరి ట్రైలర్ తరహాలో సినిమా కూడా ఆకట్టుకుంటోందా? లేదంటే బెడిసి కొట్టిందా? అసలు అభిమానులు ఏమంటున్నారు? ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు సినిమాపై అభిప్రాయాలను పంచుకునే నెటిజన్స్ ఏం చెబుతున్నారు? వారి రివ్యూ ప్రకారం ఈ సినిమా హిట్టా.. ఫట్టా తెలుసుకుందాం. థాంక్యూ సినిమాలో చైతూ నటనకైతే ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తున్నారు. పోకిరి కటౌట్ ట్విస్ట్ అదిరిపోయిందంటున్నారు. చైతూ పెర్ఫార్మెన్, విక్రమ్ కుమార్ టేకింగ్, వైజాగ్ ఎపిసోడ్, థమన్ బీజీఎమ్ సహా జనాన్ని ఆకట్టుకున్నాయి. రన్ టైం సినిమాకు ప్లస్.. అని ఒక నెటిజన్ తన రివ్యూని వెల్లడించాడు.
ఇక కామన్‌గా సినిమా చూస్తున్న ప్రేక్షకులు చైతూ యాక్టింగ్‌కి మంచి మార్కులు వేస్తున్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర అవికా గోర్‌కి దక్కిందని చెబుతున్నారు. ఈ సినిమా ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరో నెటిజన్ మూవీ ఓవరాల్‌గా చాలా బావుందని చెప్పారు. సాంగ్స్ చాలా డీసెంట్‌గా ఉన్నాయని అని కామెంట్ పెట్టారు. మొత్తంగా థాంక్యూ సినిమా టాక్ చూస్తుంటే చైతూ మరో హిట్ కొట్టాడు అని అనుకోవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పటి వరకైతే సినిమాపై టాక్ బాగానే ఉంది. మంచి మార్కులే పడుతున్నాయి. మరి పూర్తిగా రివ్యూలు బయటకు వస్తే కానీ సినిమా హిట్టో.. ఫట్టో తేలుతుంది.