Biggboss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు శనివారం ప్రోమో వచ్చేసింది. తొమ్మిది మంది కంటెస్టెంట్లకు బాగా క్లాస్ పీకారు. బాలాదిత్య, షానీ, సుదీప, శ్రీ సత్య, వాసంతి, మరీనా-రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్..ఈ తొమ్మిది మంది చిల్ అవడానికి వచ్చారంటూ పేరు పేరునా క్లాస్ పీకారు. ఈ సందర్భంగానే డబుల్ ఎలిమినేషన్ అని నాగ్ చెప్పారు. ఇక నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు? వారిలో ఏ ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే దానికి ఇప్పటికే బయట బీభత్సంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎలిమినేట్ కాబోతున్న వారి విషయంలో క్లారిటీ వచ్చేసింది.
యథావిధిగా ఓటింగ్‌లో టాప్‌లో సింగర్ రేవంత్ ఉన్నాడు. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. రేవంత్ ఎవరి గురించి కాంట్రవర్సీగా మాట్లాడినా కూడా ఆయనకే ప్రేక్షకులు అతడిని టాప్‌లో పెట్టారు. నెక్ట్స్ ఫైమా ఉంది. నిన్న జరిగిన టాస్క్‌లో ఫైమా కామెడీ ఇరగదీయడంతో ఆమెకు ఓటింగ్ పెరిగింది. ఇక మూడవ స్థానంలో మరీనా-రోహిత్ జంట ఉన్నారు. ఈ క్యూట్ జంటకు ప్రేక్షకులు బాగానే అట్రాక్ట్ అవుతున్నారు. నాలుగో స్థానంలో గీతూ ఉంది. ఐదవ స్థానంలో ఆదిరెడ్డి ఉన్నారు. ఇక ఈ ఐదుగురు సేఫ్ జోన్‌లో ఉన్నారు.. ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు.
Biggboss 6 : ఆ ముగ్గురిలోనే ఇద్దరి ఎలిమినేషన్..
ఇక మిగిలిన ముగ్గురులోనే ఇద్దరి ఎలిమినేషన్ ఉండబోతోంది. రాజ్, షానీ, అభినయశ్రీ.. ఈ ముగ్గురు ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నారు. అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో రాజ్ పెదవి విప్పడం.. ఓట్లు అడిగే తీరు.. మొత్తంగా కెప్టెన్ అవడం ఆయనకు బాగా కలిసొచ్చా యి. నిన్న సడెన్‌గా రాజ్ ఓటింగ్ బాగానే పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో రాజ్ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయాడు. ఇక మిగిలిందల్లా అభినయ శ్రీ, షానీ. గత వారం కూడా అభినయకు నాగ్ చెప్పారు.. నువ్వు హౌస్‌లో ఉన్నావన్న విషయమే తెలియట్లేదు అని అప్పటికైనా కాస్త ఆడితే అభినయకు మంచిగానే ఉండేది కానీ ఈ వారం కూడా సైలెంట్‌గా కబుర్లు చెబుతూ ఉండిపోయింది. దీంతో షానీ, అభినయ ఈ వారం పక్కా వెళ్లిపోతారని టాక్. చూడాలి రేపు ఏం జరుగుతుందో.