TRS MLA : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు కలకలం రేపుతోన్నాయి. క్యాసిన్ కేసుతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. క్యాసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ తరుణంలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి క్యాసినో కేసులో చిక్కుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ తాజాగా ఆయనను విచారణకు పిలవడంతో క్యాసిన్ కేసు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మంగళవారం మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ విచారింది. ఆయనపై క్యాసినో కేసుల పలు ప్రశ్నలు సంధించింది.
అయితే ఇవాళ కూడా హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. కిషన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిందనే విషయం మొన్నటివరకు బయటకకు రాలేదే. ఈడీ కార్యాలయానికి ఆయన రావడం ఆయన వ్యవహారం బయటపడింది. ఇప్పటికే క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది. మూడు రోజుల పాటు అతడిని విచారించింది. అతడి నుంచి కీలక సమాచారం సేకరించింది. అతడి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకకుంది. చీకోటి ప్రవీణ్ నుంచి సేకరించిన కీలక సమాచారం ప్రకారం కిషన్ రెడ్డిని ఈడీ విచారణకకు పిలిచింది.
బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు, హవాలా డబ్బులు, ఫెమా నిబంధనల ఉల్లంఘన లాంటి అంశాలపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా బంగారు గనుల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. దాని గురించి కూడా ఈడీ ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈడీ విచారణకు పిలవడంతో ఆ పార్టీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. చీకోటి ప్రవీణ్ తో మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలకకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో మరికొంతమంది పేర్లు బయటకు వస్తాయనే టెన్షన్ గులాబీ వర్గాలను దడ పట్టిస్తోంది.
TRS MLA :
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం ఒకవైపు టీఆర్ఎస్ ను వెంటాడుతుంది. ఎమ్మెల్సీ కవితతో పాటు కేటీఆర్, సంతోష్ రావుపై ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కేసీఆర్ కు సంబంధించిన దగ్గర మనుషులు లిక్కర్ స్కాంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో క్యాసిన్ కేసు మళ్లీ తెరపైకి రావడం, ఎమ్మెల్యేను విచారణకు పిలవడం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది. అయితే మించిరెడ్డికి క్యాసినో ఆడే అలవాటు లేదని, వ్యాపార లావాదేవీల విషయంలో ఆయనను ఈడీ విచారణకు పిలిచి ఉంటుందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.