Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపుతుంది. తిరుగులేని క్రేజ్ ఉన్న త్రిష ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని త్రిష తల్లి క్లారిటీ ఇవ్వటం జరిగింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన నటించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ లతో సినిమాలు చేయడం జరిగింది.
ప్రస్తుతం తమిళంలో భారీ ఆఫర్ లు అందుకుంటూ దూసుకుపోతుంది. మణిరత్నం దర్శకత్వంలో “పొన్నియన్ సెల్వన్ 1” పాన్ ఇండియా సినిమాలో నటించడం జరిగింది.
ఈ సినిమా ఈనెల చివరిలో విడుదల కానుంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో త్రిష ఫోటోషూట్స్ కేక పుట్టిస్తున్నాయి.
పసుపు రంగు కలరు ఫుల్ డ్రెస్ తో.. పాటు రెడ్ కలర్ డ్రెస్ లో త్రిష ఇచ్చిన ఫోజులు ఇప్పుడు వైరల్ గా మారాయి. కుర్రకారునీ ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫోటోలకు భారీ ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి. సంవత్సరాలు వెళ్తున్నా గాని త్రిష అందంలో మార్పు రావటం లేదని.. కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ షో మాదిరిగా కాకుండా ఫుల్ డ్రెస్ తో త్రిష స్మైలింగ్ ఫోజులు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి.