సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాల కాలం పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికి ఈ భామ తన ఇమేజ్ ని ఏ మాత్రం కోల్పోకుండా సత్తా చాటుకుంటుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాకి ముందు వరకు త్రిష కెరియర్ డ్రాప్ లోనే ఉంది. చేతిలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్ట్స్ ఏవీ లేవు. అయితే పొన్నియన్ సెల్వన్ తర్వాత మళ్ళీ త్రిష రేంజ్ అమాంతం పెరిగిపోయింది. లోకేష్ కనగరాజ్ విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మరో, రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే త్రిష తెలుగులో సినిమా చేసి చాలా కాలం అయిపొయింది. చివరిగా ఆమె 2016లో నాయకి అనే సినిమా చేసింది.
ఈ ఆరేళ్ళలో ఒక్క తెలుగు సినిమా కూడా మళ్ళీ ఆమె చేయలేదు. తమిళలో చేస్తున్న సినిమాలనే తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ సీనియర్ హీరోయిన్ తెలుగులో నటిస్తుంది. అది కూడా డిజిటల్ ఎంట్రీలో భాగంగా వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తుంది. సోనీ లైవ్ కోసం బృందా టైటిల్ తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో ఆమె సందడి చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ తో సురేష్ వంగల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మధ్య సీనియర్ హీరోయిన్స్ అందరూ ఒటీటీలోకి వెబ్ సిరీస్ ల ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమన్నా, నిత్యా మీనన్, ప్రియమణి, అంజలి లాంటి స్టార్స్ అందరూ అడుగుపెట్టి సత్తా చాటారు. ఇప్పుడు వారి బాటలో త్రిష కూడా తన అదృష్టం బృందా వెబ్ సిరీస్ తో పరీక్షించుకొబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించాబోతుందని వర్కింగ్ స్టిల్స్ బట్టి తెలుస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఆమెకి ఎ స్థాయిలో ఫేం తీసుకొస్తుంది అనేది చూడాలి.