నిన్నటి ఎపిసోడ్‌లో నయనికి తన అత్తయ్య తిలోత్తమ చావు కనిపిస్తుంది. వెంటనే స్వామి దగ్గరికి వెళ్లి కాపాడమని వేడుకుంటుంది. దానికి స్వామీజి సరేనంటాడు. ఆ తర్వాత అక్టోబర్ 8 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
నయని ఇంట్లో కనిపించకపోవడంతో అందరూ తను ఎటు వెళ్లిందని అడుగుతారు. చివరికి తన భర్త విశాల్‌కు కూడా చెప్పకుండా నయని రాత్రి పూట బయటికి వెళ్తుంది. ఆ తర్వాత అందరి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. నయని ఎటు వెళ్లిందో ఇపుడు తెలియాలి అంటుంది తిలోత్తమ. ఆ తర్వాత వల్లభ, విశాల్ మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అంతలోనే నయని షటప్.. అంటూ అరుస్తుంది వల్లభ మీదికి. సరే సరే అంటూ వల్లభని నయనికి సారీ చెప్పమంటుంది తిలోత్తమ. నువ్ సారీ చెప్పాలని కాదు అన్నయ్య.. ఆడవాళ్లతో అలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది అంటాడు విశాల్. పావనమూర్తి కూడా నయని కోపం తెలుసు కదా అంటాడు. పెద్దదాన్ని అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ.. నయనిని నిలదీస్తుంది తిలోత్తమ. మన యోగక్షేమాలను కోరే వారిని కలిసి వచ్చానని అంటుంది నయని నిర్భయంగా. దాంతో తిలోత్తమ ఏం మాట్లాడదు. కానీ ఇన్‌డైరెక్ట్‌గా చెప్తుంది కానీ ఎవరో ఏంటో చెప్పట్లేదు. సూటిగా చెప్పడానికి భయమా.. సిగ్గా..? అని ప్రశ్నిస్తుంది కోడలిని. నువ్ భయపడతావని నిజం చెప్పట్లేదంటుంది నయని. అపుడు విశాల్ కూడా నిజం చెప్పేయ్ నయని.. భయపడాల్సిన విషయం అయితే ధైర్యం కూడగట్టుకుంటారు అంటాడు. అపుడు ఆ యముడే రేపు మన ఇంటికి వస్తాడు అంటుంది నయని.
ఆయనెవరో చుట్టంలా మాట్లాడతావేంటి అంటుంది దురందర. కానీ కసి మాత్రం టాపిక్ డైవర్ట్ కానివ్వదు. నువ్ ఎవరిని కలిశావ్ క్లియర్‌గా చెప్పమంటుంది. ‘నేను కలిసింది స్వామి వారిని. రేపు వచ్చే మృత్యుదేవత తిలోత్తమ ఆంటీ ప్రాణాలు తీయకూడదని వేడుకున్నా’ అని నయని చెప్పడంతో అందరూ కంగుతింటారు. హాసిని మాత్రం అత్తయ్య పోయిన తర్వాత ఏం పెట్టాలో లెక్క పెట్టుకుంటుంది. భయపెట్టడానికి నీకు వేరే మ్యాటర్ దొరకలేదా అంటాడు వల్లభ. ‘మనకు జన్మనిచ్చిన అమ్మ రేపు పొద్దున చస్తే తలకొరివి పెట్టేది నేనే’ అంటాడు వల్లభ. ఆ తర్వాత అందరూ సరదాగా తీసుకుంటారు ఆ విషయం గురించి. రేపు ఉదయాన్నే స్వామిజీ వస్తాడని చెప్తుంది నయని. శాంతి పూజ పెట్టిద్దాం.. నువేం భయపడకమ్మా.. అని ధైర్యం చెబుతాడు కొడుకు తిలోత్తమకు.
నయని పిల్లలకు పాలివ్వడానికి వెళ్తుంది. నా కాలు నొప్పి తగ్గితే బిడ్డని నేనే ఎత్తుకుంటానంటుంది సుమన. బిడ్డని ఎప్పుడైనా ఎత్తుకోవచ్చు కానీ అత్తయ్య పాడెని మోసే భాగ్యం మళ్లీ దొరకదు అంటుంది హాసిని. ఆ తర్వాత సీన్లో హాసిని చీరలు, నగలు ముందు వేసుకుని కూర్చుంటుంది. దురందర, వల్లభ అందరూ వచ్చి ఈ చీరలు ఎవరివని అడుగుతారు. తిలోత్తమ అత్తయ్యవని చెబుతుంది కాసి. ఎందుకు తీశావ్ అని అంటే ఎల్లుండి వేలం పాట పాడాలి కదా.. అంటుంది హాసిని. ఎందుకు అంత నమ్మకంగా ఉన్నావని కాసి అడగ్గా.. నా చెల్లె నయని చెప్పింది కాబట్టి ఫిక్స్ అంటుంది హాసిని. ‘ప్రాణం ఇచ్చే గాయత్రి అత్తయ్య ఉంటే వేయేళ్లు బతకమనేదాన్ని. కానీ ప్రాణం తీసే తిలోత్తమ పోతే మంచిదే కదా’ అంటుంది. రేపు మా అమ్మ బతికితే ఎల్లుండి చచ్చేది నువ్వే అంటూ వార్నింగ్ ఇస్తాడు వల్లభ.
బాబుగారు ఫైర్ ఇంజన్ వాళ్లకి ఫోన్ చేస్తే ఎంతలోపు ఇంటికి వస్తారు అని డౌట్ అడుగుతుంది నయని. అగ్ని ప్రమాదం జరగకముందే వాళ్లని పిలిపిస్తే మనకేదో అయింది అనుకుంటారు అందరు. చూడు నయని.. అందరి ముందు నిన్ను ప్రశ్నిస్తే ఫీల్ అవుతావని ఊరుకున్నా. అమ్మకి రేపు ప్రాణ గండమని నువ్ కంగారు పడడం చూసి జాలిపడాలో.. అమ్మని చూసి కంగారుపడాలో నాకు అర్థం కావడం లేదు. ‘గాయత్రమ్మ చేతుల్లోనే తిలోత్తమ హతం అవ్వాలని నేను చేస్తున్న ప్రయత్నం మీకు చెప్పలేను అనుకుంటుంది నయని మనసులో. రేపు నువ్ ప్రాణాలతో ఉండవని తెలిస్తే అమ్మ ఎంత బాదపడుతుందో ఆలోచించు అంటాడు భార్యతో. నన్ను నమ్మే మీరే ఇలా అడిగితే ఎలా బాబుగారు.. అని ఎదురు ప్రశ్న వేస్తుంది నయని. ‘తిలోత్తమ్మని మా అమ్మే భూస్థాపితం చేయాలని ఇప్పటి వరకు ఓపిక పట్టాను’ అని మనసులో అనుకుంటాడు విష్. నా మీద నింద పడ్డా పర్లేదు కానీ అత్తయ్యనైతే కాపాడాలని చెప్తుంది భర్తతో. స్వామీ వస్తానన్నారు కదా ఓపిక పట్టు ఏం కాదని అంటాడు విశాల్. నయని వెళ్లిన తర్వాత.. ‘నీకు తెలియని విషయం ఏంటంటే.. రేపు మా అమ్మ గాయత్రీదేవి మృత్యుదేవత అవతారంలో దూసుకొస్తుందని నువ్ అన్నదే నిజమై తిలోత్తమ అసువులు తీసేస్తుంది’ అనుకుంటాడు లోలోపల.
తిలోత్తమ దగ్గరికి జాతకం తీసుకుని వెళ్తారు వల్లభ, కాసిలు. రేపు జరగబోయేది ఇక్కడేం రాసి లేదని చూపిస్తాడు తల్లికి. కానీ తిలోత్తమ మాత్రం కోపంగా ఆ కాగితాన్ని చించి పారేస్తుంది. మరి నిజంగానే తిలోత్తమ చనిపోనుందా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..