దుర్గాష్టమి సందర్భంగా నయని పూజలు చేస్తుంది. ఇంట్లోని వారంతా పూజలో పాల్గొంటారు. విక్రమ్ లేని వాళ్ల గురించి తప్పుగా మాట్లాడిన తమ్ముడికి క్లాస్ పీకుతాడు. నయని కూడా తన చెల్లెలికి లేని వాళ్లు అంటూ ఎవరూ ఉండరూ అని అర్థమయ్యేలా చెప్తుంది. ‘నయని పూజ సమయంలో కూడా ఆడవాళ్ల పోరు ఎందుకు? హారతి ఇస్తే ఎవరి గదుల్లోకి వారు వెళ్తారు కదా అంటుంది’ అత్తయ్య. దాంతో అందరికి హారతి ఇస్తుంది నయని. ధర్మం అంటే అర్థం ఏంటో తెలుసా నీకు అని ప్రశ్నిస్తాడు. నువ్ చెప్పు అమ్మ అంటాడు. నీతిగా, నిజాయితీగా ఉండడమే ధర్మం అంటుంది నయని అత్తయ్య.
అప్పుడు విక్రమ్ కాదు అంటాడు. మరేంటి అని అడగ్గా నాకంటే నయనే బాగా చెప్తుంది. నువ్ చెప్పు నయని అంటాడు భార్యని. ‘ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతమాం. ధరించినది కాబట్టి ధర్మం…’ అంటూ ధర్మానికి గల అర్థం చెప్తుంది నయని. ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ముందుకుపోవాలి అంటూ ధర్మానికి గల నిగూఢ అర్థాన్ని క్లుప్తంగా వివరిస్తుంది నయని. దాంతో అందరూ సూపర్ అంటూ చప్పట్లు కొడతాడు. నేనే కాదు హాసిని అక్క కూడా ధర్మానుసారంగా నడుకుంటారు బాబాయ్ గారు అంటుంది నయని. ఇంతకూ సుహాసిని పూజ ఎందుకు చేస్తారు వదిన గారు అని అడగ్గా.. పూర్వ జన్మవాసనలు మంచివైనపుడు గృహిణిగా సుహాసిని పూజలు చేయాలి అంటుంది నయని. దాంతో వదినని పొగడ్తల వర్షంలో ముంచుతాడు మరిది. అంటే నాకు గానీ, అత్తకు గానీ సుహాసిని పూజ చేసే అదృష్టం లేదా అంటూ ప్రశ్నిస్తుంది సుమన. అది మీరే డిసైడ్ చేసుకోండి అంటాడు విష్.
ఈ సుహాసిని పూజ నయనికే చేయండి అంటారు అందరూ. హాసినికి చెప్పి పీట వేయించి నయనిని దానిపై కూర్చోబెడతారు. ఈ తతంగం అయ్యేవరకు నయనిలా చూడకని.. సుహాసినిలా చూడమని సూచిస్తాడు బాబాయ్. సుమనని వెళ్లి కాటుకు, అద్ధం తీసుకురమ్మని చెప్తుంది. తిలోత్తమని కాళ్లు కడగమని సూచిస్తుంది. కాళ్లా.. అంటూ నోరెళ్లబెడుతుంది నయని అత్తయ్య. అఇష్టంగానే నయని పాదాలు కడుగుతుంది తిలోత్తమ. ఇపుడు పసుపు రాయమని సూచించగా.. చెప్పినట్లు చేస్తుంది తిలోత్తమ. నయని చెంపలకు గంధం రాస్తుంది. వాయినం ఇస్తున్నట్టే చేయాలా అని అడగ్గా… కొంచెం అలాగే చేయాలి వదిన అంటుంది. కాటుక డబ్బ దొరకపోగా.. పాప బుగ్గన ఉన్న కాటుకు పెట్టమని చెప్తాడు విష్ తన తల్లికి. ముందుగా జడ వేసి, పూలు పెట్టి ఆ తర్వాత కాటుక పెట్టాలని అంటుంది వదినతో.
పూజా విధానంలో భాగంగా కాటుకు కోసం గాయత్రి దగ్గరికి వెళ్తుంది తిలోత్తమ. పాప బుగ్గను ముట్టుకోగానే తిలోత్తమ చేతికి షాక్ తగులుతుంది. దాంతో ఒక్కసారిగా అరుస్తుంది. అందరూ ఏమైంది అంటూ అక్కడికి పరుగున వస్తారు. ‘మమ్మీ.. ఏమైంది’ అంటూ కొడుకులు అడిగినా తిలోత్తమ మాత్రం నోరు విప్పదు. పాపని అదోలా చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకేం చేయాలో చెప్పమని తిలోత్తమ అడగ్గా.. నయనికి హారతి ఇచ్చి మిగతా ప్రాసెస్ అంతా పూర్తి చేసి వెళ్లిపోతుంది. తల్లికి ఏమైందో అర్థం కాక అందరూ కాసేపు కంగారు పడతారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత నయని అందరికీ ప్రసాదం పంచి పెడుతుంది. ఆ తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..