గాయత్రి జయంతి వేడుకలు, గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ వార్షకోత్సవాల్ని జరపాలనుకుంటారు నయని, విశాల్. ఆ వేడుకల్ని అడ్డుకోవడానికి తిలోత్తమ కొడుకు, కోడలికి ప్లాన్ చెబుతుంది. దాంతో వార్షికోత్సవాలు జరగవని అంటారు వల్లభ, కసిలు. నయని మాత్రం జరుగుతాయని ఛాలెంజ్ విసురుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సంబరాలు కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకోవడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తుంది తిలోత్తమ. దాంతో వల్లభ, కసిల మైండ్ బ్లాంక్ అయిపోతుంది. విశాల్‌తో సహా అందరూ సంతోషిస్తారు. ల్యాప్‌టాప్ అన్‌లాక్ కోసం విక్రాంత్ తన ఫ్రెండ్‌కి కాల్ చేసి అడుగుతాడు. అంతలోనే సుమన మళ్లీ వచ్చి ల్యాప్ టాప్ లాక్కుంటుంది. సీసీటీవీ ఫుటేజి చూస్తుందని భయపడతాడు విక్రాంత్ . కానీ అందులో ఏం కనిపించకపోవడంతో సుమన ల్యాప్ టాప్ తిరిగిచ్చేస్తుంది. విక్రాంత్ ల్యాప్ టాప్ తీసుకుని ఫుటేజి కోసం వెతుకుతాడు. సుమన అక్కడే ఉండి విక్రాంత్ ని గమనిస్తుంది. ఆ తర్వాత సీన్‌లో విశాల్ నయని దగ్గరికి వెళ్లి జయంతి వేడుకలు జరిపించడానికి మా అమ్మని ఎలా ఒప్పించావ్ అని అడుగుతాడు. చెప్పలేను కానీ చేసి చూపించనా అంటుంది నయని. పాలగ్లాసు పట్టుకొని రెండు చేతులు చాచమంటుంది నయని. వెనకనుంచి వెళ్లి భర్తని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత నయని, విశాల్‌ల మధ్య కాసేపు రొమాంటిక్ సీన్ నడుస్తుంది.
సీన్ కట్ చేస్తే.. వల్లభ, కసిలు తిలోత్తమ దగ్గరికి వెళ్తారు. ఒక్కదానివే ఏం చేస్తున్నావంటూ అడుగుతారు. ‘నాకు నచ్చని పని ఎప్పుడూ చేయను. అలాంటిది ఈ రోజు నాకు నచ్చని నయని కోరికని మెచ్చేలా ప్రవర్తించాను. అందరిముందు నటించడానికి నేను ఎంత ఇబ్బందిపడ్డానో నాకే తెలుసు’ అంటుంది తిలోత్తమ. అంతలా బాధపడడం ఎందుకు మమ్మీ.. జరగవని చెప్తే అయిపోయేది కదా అంటాడు వల్లభ. లోపల జరిగిందేంటో మనక తెలియదు కదా అంటుంది కసి. జరగకూడదని చెప్పిన అత్తయ్యే ఒప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటుంది. ఏమైందని వల్లభ అడగ్గా.. మల్లయుద్ధం అంటుంది తిలోత్తమ. నయని వచ్చి తిలోత్తమతో ఏం మాట్లాడిందో చెప్తుంది. ‘గాయత్రమ్మ వేడుకల్ని జరుపుకోమని హాల్‌లోకి వచ్చి చెప్పండి’ అంటుంది నయని. దానికి తిలోత్తమ నవ్వి.. జరగకుండా అడ్డుకోమని ప్లాన్ వేసిందే నేను. నువ్ కాళ్లు పట్టుకున్నా నేను ఒప్పుకోను అంటుంది. జుట్టు పట్టి తీసుకెళ్తే అని నయని అనగానే.. తిలోతతమ వచ్చి నయని గొంతు పట్టుకుంటుంది. నన్నే జుట్టు పట్టి ఈడ్చుకెళ్తావా? ఎవరిని చూసుకొని నీకు ఈ ధైర్యం అంటూ అరుస్తుంది. అపుడు నయని చేయి తీసేసి తిలోత్తమ చేయి పట్టుకుని విరుస్తుంది.
‘నేను కాదు అత్త. నీ జుట్టు పట్టుకునేది చట్టం. గాయత్రమ్మ గారి ప్రాణాలు తీసేసి, విశాల్ బాబుని మచ్చిక చేసుకుని మేక తోలు కప్పుకున్న తోడేలు లాగా కంపెనీలో పడి ఎంత దోచుకున్నావో ఎన్ని తప్పులు చేశావో లెక్కలన్నీ పక్కకు తీసి పెట్టాను. నేను ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టిందే నా మొగుడిని కాపాడుకోవడానికి. అతన్ని చంపేయాలని నువ్ ఎన్నిసార్లు ప్రయత్నించావో రాసి పెట్టాను. గాయత్రమ్మకు సెక్రటరీగా చేరి ఈ పద్దెనిమిదేళ్లు నువ్ చేసిన పాపాల్ని చాపేసి పరిస్తే.. కంపెనీలో వంద రూపాయల పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారి కూడా నీకు బొంద పెడతాడు. ఇపుడు చెప్పనా’ అంటూ భయపెడుతుంది నయని. దాంతో తిలోత్తమ దారికి వస్తుంది. ఇపుడు నీకేం కావాలని అడుగుతుంది. హాల్లోకి వచ్చి గాయత్రమ్మ జయంతి వేడుకులు జరుగుతాయని చెప్పమంటుంది. ఇదంతా విని వల్లభ వాళ్లు షాకవుతారు. ప్రతీకారం తీర్చుకోవడానికి లిస్ట్ రాసి పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తుందని అంటుంది కసి. నయని అనుకున్నది ఏదో ఒకరోజు జరిగితీరుతుంది జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది తిలోత్తమ. జయంతి వేడుకలు ఎలా జరుగుతాయో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..