నయని దగ్గరి నుంచి శాస్త్రి గారు గాయత్రిని తీసుకుని వెళ్తారు. వెళ్లేటపుడు గానవి, నయనిలను ఆశీర్వదిస్తాడు. అది చూసి తిలోత్తమలో అనుమానం మొదలవుతుంది. మరోవైపు విశాల్ గాయత్రి జయంతి వేడుకని ఘనంగా నిర్వహించాలనుకుంటాడు. కానీ తిలోత్తమ మాత్రం అడ్డుకునేందుకు ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 17 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సుమన, హాసినిలు కలిసి గానవికి బట్టలు సెలెక్ట్ చేస్తారు. దురందర వచ్చి వారిని ఎవరికీ బట్టలని అడుగుతుంది. అంతలోనే కసి వచ్చి పొద్దు పొద్దున్నే ఏంటి వల్లభ ఇది అంటుంది. సుమన కూతుర్ని హాసిని ఎత్తుకోవడం ఏంటో అంటుంది. దానికి హాసిని నీకెందుకే అంటూ ధ్వజమెత్తుతుంది. అపుడే నయని వచ్చి పుండరీకం పడుకున్నాడా అక్కా అని అడుగుతుంది. పాలు తాగి పడుకున్నాడని హాసిని అంటుంది. అపుడు సుమన నాకెందుకు పాలు పట్టే అదృష్టం లేదంటుంది. దేవుడు ఆపేశాడు కాబట్టి అని ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు విక్రాంత్. విశాల్ ఆఫీస్‌కు బయల్దేరే సమయంలో వల్లభ.. ఈ నోటిస్ చదువు బ్రో అంటూ ఇస్తాడు. బాబుగారు ఏముంది అందులో అని నయని అడగ్గా.. ‘గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ వార్షికోత్సవాలు జరపడానికి వీల్లేదని నోటిసు పంపించారు’ అని చెప్తాడు విశాల్. ‘పంపలేదు విశాల్.. తీసుకువచ్చాం’ అంటుంది కసి. బాబుగారు కంపెనీ చైర్మన్ అంటుంది నయని. ‘అసలు మీ ప్రాబ్లం ఏంటి’ అని అంటాడు విక్రాంత్ కూడా. ‘అది చెప్పడానికే మేం ఉవ్విళ్లూరుతున్నాం. ఆస్తిని మూడు ముక్కలు చేసి చకచకామని సంతకాలు చేసిన మొగుడు పెళ్లాలిద్దరూ అసలు విషయం మర్చిపోయారు. గానవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో మాకూ వాటా ఉంటుంది’ అని నిజం చెప్పేస్తాడు వల్లభ. వాటా కోసం ఇంత దిగజారుతారా? అని విశాల్ ప్రశ్నించగా.. వాటా కోసం కాదు స్పేస్ కోసమంటుంది కసి.
ఈ ఆలోచన వీళ్లది కాదు.. నిన్ను పెంచి పెద్ద చేసిన తిలోత్తమది విశాల్ అంటుంది హాసిని. బోర్డు మెంబర్స్‌లో ఎంత మంది దీన్ని అంగీకరించారని విక్రాంత్ అడగ్గా.. ఆరుగురని చెప్తుంది కసి. అయినా సరే వార్షికోత్సవాలు జరుగుతాయి అంటాడు వల్లభ. ఎలా అని ప్రశ్నించగా.. మీలాగే నేను సుమన కూడా బోర్డు మెంబర్లమే. అపుడు సంఖ్య పెరిగిపోతుంది అంటాడు విక్రాంత్. దానికి సుమన ఓకే చెప్పాలి కదా అంటుంది కసి. దానికి సుమన ఒప్పుకోదు. నయని, విశాల్‌లు ఎంత చెప్పినా సుమన ఒప్పుకోదు. మిమ్మల్ని ఫ్రీగా పోషిస్తున్నామని దురందరని సుమన అనడంతో కోపంగా భార్యమీదికి చేయి ఎత్తుతాడు విక్రాంత్.
ఈ సంవత్సరంతో వేడుకలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే అని వల్లభ అనగా.. పడదు అని తేల్చి చెప్పుతుంది నయని. మీలో నుంచే ఒకరు ఓకే అనేలా నేను చేస్తా అని సవాల్ విసురుతుంది నయని. ఒప్పుకోకపోతే ఎలా అని కసి అడుగుతుంది. విశాల్ నయనితో అలా ఎలా ఛాలెంజ్ చేస్తావ్ అని అడగ్గా.. అత్తయ్యతో నేను చెప్పిస్తా బాబుగారు అంటుంది. భర్త ఎంత చెప్పినా నయని మాట వినదు. నేను ఎలాగైనా ఒప్పిస్తానని మాటిస్తుంది నయని. విశాల్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని నయని అత్తగారి దగ్గరికి బయల్దేరుతుంది.
అందరూ నయని కోసం హాల్లో ఎదురు చూస్తుంటారు. వాళ్లిద్దరి గురించి ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతారు. అంతలోనే నయని తిలోత్తమ చేయి పట్టుకుని వస్తుంది. అది చూసి అందరూ షాకవుతారు. అక్క నువ్ చేయి వదులు.. అని సుమన అనగా విడిచిపెడుతుంది నయని. జయంతి వేడుకలు జరుపుకోవడానికి మీర ఒప్పుకున్నారా అత్తయ్య అని కసి, వల్లభలు అడగ్గా.. తిలోత్తమ నసుగుతుంది. అందరూ తిలోత్తమ నోటి వెంట ఏం వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తారు. అత్తయ్యా.. నన్ను చెప్పమంటారా? మీరు చెప్తారా? అని నయని అడగ్గా.. నేనే చెప్తానంటూ అసలు విషయం చెప్పేస్తుంది తిలోత్తమ. ‘గాయత్రి అక్క జయంతి ఉత్సవాలు, కంపెనీ వార్షికోత్సవాలు జరపడానికి నేను ఒప్పుకున్నా’ అంటూ బాంబ్ పేల్చుతుంది తిలత్తమ. దాంతో వల్లభ, కసిల నోటి వెంట మాటరాదు. హాసిని ఆనందంతో చప్పట్లు కొడుతుంది. అక్కడేం జరిగిందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..