తిలోత్తమ చీరకు నిప్పు అంటుకుంటుంది. నయని సాహసం చేసి అత్తయ్యని కాపాడుతుంది. కానీ తిలోత్తమ మాత్రం దానికి కారణం నయనేనంటూ నింద వేస్తుంది. మరోవైపు జోగయ్య శాస్త్రి పాప గురించి నిజం చెప్తాడు స్వామీజీతో. ఆ నిజం విని స్వామీ ఎవరికీ తెలియకూడదనుకుంటాడు. ఆ తర్వాత ఇంట్లో అందరి మధ్య తిలోత్తమ చావుకు సంబంధించి గొడవ జరుగుంతుంది. ఇప్పుడు అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సుమన మాటలు విని వల్లభకు కోపం వస్తుంది. భార్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. విశాల్ భార్య దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చా అంటూ పర్మిషన్ తీసుకుంటాడు. భార్య ఆరోగ్యం గురించి ఆరా తీస్తాడు. నాకేం కాదని భరోసానిస్తుంది నయని. అమ్మని కాపాడాలని అమ్మతో పోట్లాడావ్.. ఎందుకు అలా చేశావ్ అని అడగ్గా.. ముల్లుని ముల్లుతో తీయడానికి నేను ఆడిన నాటకమని చెప్తుంది నయని. తిలోత్తమ చేత కుంకుమ వేయించుకునేలా చేయడానికి గల కారణం భర్తకు తెలుపుతుంది. నీకు ఇదంతా ఎలా తెలిసింది ఆశ్చర్యంగా ఉందంటాడు విశాల్. బతికించి అమ్మకు పునర్జన్మనిచ్చావ్ అంటూ భార్యని పొగడతాడు. కానీ ఇద్దరూ లోలోపల తిలోత్తమ గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత గాయత్రిని రేపు తీసుకెళ్లడానికి శాస్త్రిగారు వస్తారని చెప్తుంది పంపించడానికి బాధగా ఉందంటుంది నయని. తప్పదని భార్యకు ధైర్యాన్నిస్తాడు విశాల్.
ఒంటరిగా ఉన్న హాసినిని ఏమైందని అడుగుతారు దురందర, వామనలు. అక్కడికి వస్తుంది సితార. ఆ దిగులకు కారణం చెప్తానంటుంది. రేపు తిలోత్తమ ఆంటీ చేతిలో హాసిన చావబోతుందంటుంది కాసి. అక్కడ ఉన్న చిలక కూడా కసిని తిడుతుంది. మీ ఆంటీని కాపాడింది మా నయనే అని చెప్తుంది శివ. అలా ఎలా అని వామన అడగ్గా.. కుంకుమ తిలోత్తమ చేతి రేఖలను తాకి మృత్యు దేవతని ఆపిందంటుంది. ఆ తర్వాత హాసిని, కసిల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. శివ మాటల్ని ఎగతాళి చేస్తారు వల్లభ, కసిలు. ముందుంది ముసుర్ల పండగ అంటూ కౌంటర్ ఇస్తుంది శివ. వీళ్లకు అనుభవంలోకి వస్తేగాని తెలియదు శివ అంటూ సమర్థిస్తుంది హాసిని.
మరుసటి రోజు ఉదయం నయని స్వామీజీని కలిసి ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. దానికి స్వామీజీ చిన్నగా నవ్వుతాడు. మీ నవ్వులో ఆంతర్యం ఏంటి స్వామీ అని నయని అడగ్గా.. ‘ఏదైతే నెరవేరాలని నువ్ కోరుకున్నావో.. అదే వద్దని అడ్డుకున్నావ్. అంతా విశాలక్షి మహిమ’ అంటాడు. నయని నాకు అర్థం కాలేదనడంతో స్వామీ మళ్లీ వివరిస్తాడు. ఆక్రోశంతో తిలోత్తమ వేసిన కుంకుమతో అమ్మవారు శాంతించారని అర్థమయ్యేలా చెప్తాడు. గండం అయితే గతి తప్పింది కద స్వామీ అని అడగ్గా.. తిలోత్తమ చావు మాత్రం ఖాయమంటాడు. తిలోత్తమని చంపడానికి గాయత్రి అమ్మవారు నా కడుపున పుడతారని చెప్పారు కదా అని నయని అడగ్గా.. గ్రహించడమే ఆలస్యం. రక్తబంధం నీ చెంతన ఉందంటాడు స్వామీ. నా బిడ్డని చంపి నన్ను మనోవేదనకు గురిచేశారంటూ బాదపడుతుంది నయని. దీపావళి రోజు చేయాల్సిన కార్యాల గురించి చెప్పి స్వామీజీ అదృశ్యమైతాడు అక్కడినుంచి.
సీన్ కట్ చేస్తే.. పాపని తీసుకెళ్లడానికి శాస్త్రి గారు నయని ఇంటికి వెళ్తారు. పాపకు బట్టలు కొని ఇస్తాడు విశాల్. సుమన వచ్చి మా అక్క పాలవ్యాపారం చేస్తుందంటూ నయనిని అవమానిస్తుంది. విశాల్ సుమనని కోప్పడకుండా వదిలేస్తాడు మరదల్ని. పదిరోజుల నుంచి పాపని జాగ్రత్తగా చూసుకున్నందుకు కృతజ్తతలు చెప్తాడు శాస్త్రి. అపుడే కసి శాస్త్రిగారిని అవమానిస్తుంది. తిలోత్తమ కూడా అందుకు వత్తాసు పలుకుతుంది. దాంతో హాసినికి ఒల్లు మండుతుంది. నయని ఏదంటూ వామన అడగ్గా.. అక్కడికి వస్తుంది తను. బయటి నుంచి వస్తున్నావ్ ఎక్కడికి వెళ్లావ్ నయని అని దురందర అడగ్గా.. పోలీసు కంప్లైంట్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుందామని వెళ్లినట్లు అబద్ధం చెప్తుంది. ఏం జరిగిందని శాస్త్రి అడగ్గా.. సుమన చెప్పబోతుంది. కానీ విశాల్ అడ్డుకుంటాడు. ఇక దయచేస్తే మంచిదని శాస్త్రిగారితో అంటుంది సుమన. కానీ వెళ్లేసమయానికి పాప గుక్కపట్టి ఏడుస్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరి మధ్య కాసేపు చర్చ నడుస్తుంది. గానవి తన కూతురని చెప్పడంతో ఆందోళన చెందుతాడు శాస్త్రి. ఆ తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..