తిలోత్తమని కాపాడేందుకు స్వామీజీ ఇచ్చిన రుద్రాక్షమాలను నయని తన అత్త మెడలో వేస్తుంది. అంతేకాకుండా ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ పొయ్యి వెలిగించకూడదంటాడు విశాల్. బయటి నుంచి అందరికీ లంచ్ తెప్పించేందుకు లిస్ట్ రాయిస్తాడు. మరోవైపు సితార నయని గదిలోని బొమ్మ తీసుకురమ్మని వల్లభకు చెప్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
గాయత్రి అంటే శాస్త్రిగారి మనవరాలు కాదు ఆ బొమ్మ అంటుంది సుమన. ఓహో బొమ్మనా అని వెటకారం చేస్తుంది సితార. అసలు గాయత్రిని గదిలో నుంచి ఎవరు తీసుకురమ్మన్నారు అని కోప్పడుతుంది నయని. బొమ్మకు కాఫీ తాగించానని చెబుతుంది సితార. మీరు ఫైర్‌తో ఆడుకుంటున్నారని హెచ్చరిస్తాడు వల్లభ. మరి ఆ కాఫీ ఎలా వచ్చిందంటే ఆర్డర్ చేసినట్లు చెప్తుంది సితార. ఎంగిలి కాఫీ తాగించినట్లు కాసి చెప్పగానే తన చెంప పగలగొడుతుంది హాసిని. నన్ను కొడతావా? అంటే నిన్ను మాత్రమే కొడతానంటూ హెచ్చరిస్తుంది. హాసిని ఈ దెబ్బల్ని గుర్తుపెట్టుకో అంటే సెల్ఫీ తీసుకోమంటుంది హాసిని. నా మొగుడిని వలలో వేసుకున్న నిన్ను ఏం అనలేదు కానీ నయని చెల్లి నా ప్రాణమని చెప్తుంది. నా చెల్లి కడుపుకోతను కూడా దిగమింగుకొని మాకు ఆస్తిని పంచి ఇచ్చిందంటూ ఎమోషనల్ అవుతుంది హాసిని. కాసిని కొట్టేందుకు సోఫా ఎక్కుతుంది అందరూ కలిసి తనని ఆపుతారు. విశాల్ కూల్ వదిన అని చెప్పగా తగ్గుతుంది హాస్. వల్లభ బొమ్మని కాసికి ఇచ్చి వెళ్లిపోతాడు. సితార దానికి డ్రెస్ వేసి నయనికి అందిస్తుంది. ఆ తర్వా త అందరూ ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లిపోతారు.
నయని పిల్లల్ని ఆడిస్తుంది. తన చేయి తాకి దిండు కింద పడుతుంది. అంతలోనే నయనికి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. గాలి విస్తృతంగా వీస్తుంది. అక్కడ తిలోత్తమ రుద్రాక్ష మాల తీసి పక్కన పెడుతుంది. దిండులోనుంచి పత్తి అంతా ఎగిరి పడుతుంది తిలోత్తమ గదిలో. పాప చేతిని తాకి పత్తికి నిప్పు వెలుగుతుంది. ఆ మంటలు తిలోత్తమ కొంగును అంటుకుంటాయి. అది గమనించిన నయని అత్తయ్యా అంటూ మంటల్ని ఆర్పేస్తుంది. హాసిని మాత్రం వీడియో తీస్తుంది. చీర ఎలా అంటుకుంది మమ్మీ అని వల్లభ అడగ్గా.. ఈ నయనే నా చీరకు నిప్పు అంటించింది అంటుంది తిలోత్తమ. విశాల్ అడగ్గా కూడా తిలోత్తమ అదే సమాధానం చెప్తుంది. అలా నింద వేస్తారేంటి అత్తయ్య అని నయని అనగా కోపంతో చేయి ఎత్తుతుంది తిలోత్తమ. ఆ చేయిని ఆపుతుంది దురందర. కాపాడాలనుకున్న నయనిని ఎలా కొడతావ్ అంటూ ప్రశ్నిస్తుంది. ‘అమ్మా.. ఈ రోజు ఇంట్లో పొయ్యి వెలగలేదు. టిఫిన్లు కావాలంటే బయటి నుంచి తెప్పిస్తున్న నయనిని అపార్థం చేసుకోవడం నాకు నచ్చలేదమ్మా’ అంటాడు విశాల్. అది కాదు రా.. నేను ఇపుడే స్నానం చేసి చీర కట్టుకున్నానంటూ తప్పించుకుంటుంది తిలోత్తమ. ఆ తర్వాత ఒకరిపై ఒకరు మాటల బాణాలు వదులుకుంటారు. అసలు నిప్పు ఎలా అంటుకుందో నేను చెప్తానంటాడు దురందర భర్త. తిలోత్తమని ఒకసారి చూడండి అంటాడు. రుద్రాక్ష మాల లేదని చూపిస్తాడు అందరికీ. దాంతో ప్రాణ గండం ప్రళయ కాలం చేసిందంటాడు.
నా చిట్టి మొగుడు గుట్టు విప్పాడంటూ భర్తని పొగడుతుంది దురందర. నూటికి నూరు పాళ్లు బాబాయి గారు చెప్పింది నిజమే పిన్ని అంటుంది నయని. ఆ రుద్రాక్ష మాల మీ మెడలో ఉన్నంత వరకు ఎలాంటి నష్టం జరగదని స్వామీజి చెప్పారు కదా అని నిలదీస్తుంది నయని తిలోత్తమని. ఓహో ఈ మాల మ్యాజక్ చేసి మంటలు తెచ్చిందా అని తిలోత్తమ అనగా.. కాసి రుద్రాక్షని నేలకేసి విసిరికొడుతుంది. దాంతో వల్లభ సితార చెంప పగలగొడతాడు. ఎందుకు కొట్టావు వల్లభ అని సితార అడగ్గా.. ‘ఆ మాల తెగిపోయింది. మా అమ్మ ప్రాణాలకేమైనా అయితే నువ్ తిరిగి తీసుకొస్తావా’ అంటాడు చిరాకుగా. దాంతో అందరూ షాకవుతారు. ‘ఓరి నాయనో ఇక అత్తయ్య చావుని ఆపడం ఎవరి తరం కాదు. ఇందాక నా చెల్లి చూసింది కాబట్టి సరిపోయింది. ఇక ఎవరూ ఆపలేరు’ అంటూ నవ్వుతుంది హాసిని. మరి తిలోత్తమ చావు ఖాయమా? తెలియాంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..