తనని కాపాడాలనుకున్న తిలోత్తమకు నయని ఉద్దేశం ఏంటో అర్థం కాదు. పాపని తీసుకెళ్లడానికి శాస్త్రి ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో మృత్యువు నుంచి తిలోత్తమని కాపాడడానికి స్వామీజీ కూడా అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత స్వామి నయనకి రుద్రాక్ష మాల ఇచ్చి తిలోత్తమ మెడలో వేయమని సూచిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 11 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మీ అత్తని నువ్వే కాపాడమని నయనికి రుద్రాక్ష మాల ఇస్తాడు స్వామి. అంతకు ముందే పాప చేతు ఆ మాలకు తాకుతుంది. శాస్త్రి మంత్రాలు చదువుతుండగా నయని దాన్ని తిలోత్తమ మెడలో వేస్తుంది. మెడలో బంగారం అలంకారం.. ఇది జాగ్రత్తగా చూసుకోండని చెప్తుంది కోడలు. హాసిని హారతి తీసుకొస్తానంటే వద్దంటారు అందరూ. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోతారు స్వామి, శాస్త్రిలు. విశ్ చేతుల్లో ఉన్న గాయత్రిని తీసుకుని వెళ్తుంది నయని. మరోవైపు నయని తనని కాపాడం వెనుకు ఉన్న ఉద్దేశం అర్థం కాక తెగ ఆలోచిస్తుంటారు తిలోత్తమతో పాటు వల్లభ, కసిలు. అక్కడికి హాసిని వచ్చి ‘అత్తయ్యా రెండు క్షణాలు కళ్లు మూసుకో’ అని తనకి నుదిటి మీదు మూడు నామాలు పెడుతుంది. ఎందుకే ఇలా చేసావ్ అని కోడల్ని కోప్పడుతుంది తిలోత్తమ. ఉన్నట్టుండి ఇలా ఎందుకు పెట్టావ్ అని వల్లభ అడగ్గా.. గగ్గోలు పెడుతూ ఏడుస్తుంది హాసిని. ఏంటని అందరూ అడగ్గా.. మీరు కాసేపట్లో పోతారు అత్తయ్య అంటుంది. పోయేముందు ఇలా నామాలు దిద్దుకుంటే డైరెక్ట్‌గా వైకుంఠానికే పోతారట అంటుంది హాసిని. నేను స్నానం చేసి వస్తా.. మీరెళ్లండని పంపిస్తుంది కొడుకు, కోడల్ని.
సీన్ కట్ చేస్తే.. ఎవరెవరికి ఏం టిఫిన్లు కావాలో లిస్టు రాసుకుంటాడు విక్రాంత్. బ్రదర్ నీకేం కావాలని అడగ్గా.. వల్లభ నాకేం అక్కర్లేదు అంటాడు కానీ చివరికి చెప్పేస్తాడు. కసిని అడగ్గా.. నేను బయటి ఫుడ్ మానేశాను అంటుంది. ఈ రోజు ఇంట్లో పొయ్యి వెలగదు. టిఫిన్, లంచ్ అంతా బయటినుంచే తీసుకొస్తామని చెప్తాడు విశాల్. మృత్యుగండం ఉందని పొయ్యి వెలిగించరా..? నాకు కాఫీ కావాలంటే ఎలా అని సుమన ప్రశ్నించగా.. అత్యయ్య గారు ఆహుతి అవుతారని నేను ఆరాటపడుతుంటే నువ్ కాఫీలు అంటే ఎలా చెల్లి అని ప్రశ్నిస్తుంది నయని. సితార కూడా నయని మాటలు వినకుండా వంట చేసుకుంటానంటుంది. అత్తయ్యని పిలిచి అడగమని సుమన సలహా ఇస్తుంది. వాళ్ల భయం వాళ్లది.. మన నమ్మకం మనది కమ్ వల్లభ అని పిలుస్తుంది సితార. నయని అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా కిచెన్‌లోకి వెళ్లి జారి పడతారు. ఇక్కడ నీళ్లు ఎవరు పోశారని అడగ్గా.. నేనేనంటూ తలాడిస్తుంది హాసిని. అడ్వాన్స్‌గా ఆలోచించి మంటలు అంటుకోకుండా అలా చేశానంటుంది నవ్వుతూ. నయని వద్దన్నా వినకుండా వెళ్లారని గుర్తుచేస్తాడు విశాల్ వాళ్లకు.
మరుసటి రోజు ఉదయం వల్లభ బేబీడాల్ తీసుకుని సితార దగ్గరికి వెళ్తాడు. నయని గది నుంచి తీసుకొచ్చిన ఆ బేబీడాల్‌తో ఏం పని అని అడుగుతాడు. ముందుగా నువ్ అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా.. పొయ్యి వెలగని ఈ ఇంట్లో నేను కాఫీ తాగుతున్నా.. ఆర్డర్ చేసి తెచ్చుకున్నా.. చివరగా మిగిలిన కాఫీ ఈ బొమ్మకు తాగిస్తానంటుంది కసి. ‘బేబీ గాయత్రి మీ అమ్మ నీకు పాలు తాగిస్తుంది కదా.. నువ్ ఈ కాఫీ తాగు’ అంటూ తాగిస్తుంది. కోపంగా బొమ్మని లాక్కుంటాడు వల్లభ. ఆ డ్రెస్ తీసేయమని వేరే డ్రెస్ తెచ్చి వేస్తాడు. అప్పుడే దురందర వస్తుంది అక్కడికి. బట్టలు లేని బొమ్మని చూసి గట్టిగా అరుస్తుంది. ‘నీకేం పోయే కాలమే. బొమ్మ బట్టలు ఎందుకు విప్పావు. అసలేం చేస్తున్నావ్’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆ అరుపులకు అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రశ్నిస్తారు వల్లభని. నన్నేం అడగద్దు కసినే చెప్తుంది అంటాడు తను. హాసిని నేను హ్యాండిల్ చేస్తానంటూ ‘సీ కసబిస నువ్ నీళ్లలో జారిపడినందుకు ఒకటి కాదు పది డ్రెస్సులు మార్చుకో కానీ గాయత్రి డ్రెస్ ఎందుకు తీసావ్’ అని ప్రశ్నిస్తుంది. నేను గాయత్రి డ్రెస్ తీసానా. ఏంటి ఇలా నిందలు వేస్తుంది అంటుంది కసి. అది బొమ్మా అంటూ ఎగతాళి చేస్తుంది కసి. ఆ తర్వాత ఏం గొడవ జరుగుతుందో తెలియాంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..