తిలోత్తమ చావు గురించి నయని తనకు తెలిసిన నిజాన్ని చెప్తుంది. అది విని అందరూ షాకవుతారు. మరోవైపు గాయత్రీదేవి చేతిలోనే తిలోత్తమ హతం కావాలని విశాల్ కూడా అనుకుంటాడు మనసులో. అక్కడ వల్లభ తన తల్లికి జాతకం తీసుకెళ్లి ఇస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 10 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పనికి రానిది చేతిలో ఉండకూడదంటూ జాతకాన్ని చించిపారేస్తుంది తిలోత్తమ. నయని నేను రేపు చచ్చిపోతున్నానని చెప్పిందంటే కాలచక్రం జాతకచక్రాన్ని వేరే దిశగా తిప్పిందని అర్థం అంటుంది కొడుకుతో. నయని చెప్పిందే నిజమంటావా మమ్మీ అని వల్లభ అడగ్గా.. దానికి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం గురించి ముందే తెలుస్తాయి అంటుంది. మీ చావు గాయత్రి ఆంటీ చేతిలో ఉందని మీరు నమ్ముతారు కదా ఆంటీ అంటుంది కసి. రేపు చిన్నపిల్లలెవర్నీ ఇంట్లోకి రానివ్వద్దని తిలోత్తమ చెప్పగా సరేనంటారు ఇద్దరూ. ‘నా అంతు చూడడానికి ఆశ పడే నయని.. ఈ సారి ఎందుకు నాకేమి కాకూడదని కోరుకుంటుంది’ అని అనుమానం వ్యక్తం చేస్తుంది తిలోత్తమ. సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్లు కూడా అంటారు. నన్ను భయబ్రాంతులకు గురిచేసి నా ఆరోగ్యం పాడుకావాలనేం కోరుకోవట్లేదు కదా అంటూ చర్చిస్తుంది కొడుకు, కోడలితో. రేపటితో నయనికి సడెన్‌గా పుట్టుకొచ్చిన ప్రేమ ఏంటో తెలిసిపోతుంది అంటుంది తిలోత్తమ.
సీన్ కట్ చేస్తే.. హాసిని నయని దగ్గరికి వెళ్లి.. చెల్లి ఫోన్‌కి చార్జింగ్ పెట్టుకున్నావా? అని అడుగుతుంది. ఎందుకు అని నయన అడగ్గా.. వెనకే వచ్చిన దురందర అందర్నీ అలాగే అడుగుతుందని చెప్తుంది. హాసిని నమ్మకం చూసి నీ వల్లే అంతా అని తిడుతుంది దురందర. ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకే స్వామి వారిని రమ్మని పిలిచానంటుంది నయని. నయని నాలుక మీద ఉన్న మచ్చ చూపించమంటావా అని అంటుంది హాసిని. బాబాయి దగ్గరి నుంచి రూపాయి బిళ్ల తీసుకుంటుంది హాసిని. దాంతో ఏం చేస్తావ్ అక్కా అని నయని అడగ్గా.. అత్తయ్య పోయాక నుదిటి మీద పెడతానంటుంది. ఆస్తి గురించి గొడవలు పెట్టించింది కదా పోయేటపుడు ఏం తీసుకెళ్లలేదని చూపిస్తా.. అంటుంది హాస్యంగా. గాయత్రిని పట్టుకోమని అక్కకి ఇచ్చి నయని వెళ్తుంది అక్కడి నుంచి. అపుడే సుమన వచ్చి నీ కొడుకును ఎత్తుకోకుండా దిక్కుముక్కు లేని పిల్లను ఎత్తుకున్నావేంటి అంటుంది హాసినితో. అపుడే అక్కడికి వస్తారు శాస్త్రిగారు. సుమన అన్న మాటలకు నయని క్షమాపణ చెబుతుంది. విశాల్ కూడా నయనని తిడతారు. వల్లభ, కసిలు మాత్రం వెటకారం చేస్తారు.
తిలోత్తమ శాస్త్రి గారికి తన చావు గురించి వివరిస్తుంది. శుభకార్యాలు చేసే మీరు ఆ కార్యక్రమాలు కూడా జరిపించి వెళ్లమని సూచిస్తుంది. తప్పకుండా తిలోత్తమ అంటూ స్వామివారు వస్తారు. ఏ నిమిషమైనా తిలోత్తమ మజిలి పోవచ్చు అంటాడు స్వామి. అపుడు నయని ‘నేను చెప్తే అత్తయ్య వాళ్లు తేలికగా తీసుకుంటున్నారు. శాస్త్రిగారు మీరు గాయత్రిని తీసుకెళ్లండి’ అంటుంది. పాపని శాస్త్రిగారికి ఇవ్వకూడదని అంటాడు స్వామి. ఎందుకని అడగ్గా.. ఆడపిల్ల శుక్రవారం నాడు గడప విడిచి పోరాదని వెల్లడిస్తాడు. మృత్యుదేవత తిలోత్తమ రక్తం తాగడానికి పయనమైందని అంటాడు స్వామీజీ. మమ్మీ చావు గురించి కొడుకులు, కోడళ్లు పోట్లాడుకుంటారు. అత్తయ్యని ఎలాగైనా కాపాడాలని అంటుంది నయని. నీ ఆరాటం సరిపోదు నయని అంటాడు విశాల్. తిలోత్తమని కాపాడమని స్వామిని వేడుకుంటుంది నయని. అది చూసి నాటకమంటారు వల్లభ, కసి. రేపు తిలోత్తమ తప్ప మిగిలిన వాళ్లంతా సజీవంగా ఉంటారని మాటిస్తాడు స్వామిజీ.
పాపని భర్తకు ఇచ్చి నయని స్వామితో తిలోత్తమ కాపాడమని వేడుకుంటుంది. అత్తయ్యని మృత్యువు కబంళించకూడదని అర్థిస్తున్నానంటుంది. దైవాన్ని ఎదురించలేనంటాడు స్వామి. ఆలోచించి ఆలస్యం చేయకండి స్వామి అని నయని అడగ్గా.. ఆలోచిస్తున్నది నేను కాదు తిలోత్తమ అంటాడు. అపుడు విశాల్ తల్లికి నచ్చచెప్పి మృత్యువును ఆపే పరిష్కారం అడగమంటాడు. తిలోత్తమ సరేననగా.. స్వామి రుద్రాక్ష మాల ధరించమని తిలోత్తమకు సూచిస్తాడు. నయని మాల వేసేటపుడు శాస్త్రి గారిని మృత్యుంజయ మంత్రం జపించమంటాడు స్వామి. మరి తిలోత్తమ ప్రాణాలతో బయటపడుతుందా లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..