BIGG BOSS: ఏ భాషలో జరుగుతున్న బిగ్ బాస్ షోలో అయినా సరే ఖచ్చితంగా లవ్ ట్రాక్ కొనసాగడం సర్వసాధారణం. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే అనేక మంది కంటెస్టెంట్స్ జంటలుగా కొనసాగాయి. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ షోలో మాత్రం ఈ లవ్ ట్రాక్ అనేది ప్రతి సీజన్ లోనూ కొనసాగుతూనే వస్తోంది. లాస్ట్ సీజన్ లో అఖిల్ లవ్ ట్రాక్ హీరోయిన్ మోనల్ తో సాగింది. అంతకు ముందు సీజన్ లో రాహుల్ సిస్లీ గంజ్, పునర్నవి మద్య లవ్ ట్రాక్ నడిచింది.
ఇక ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. నేను శైలజా హీరోయిన్ శ్రీసత్య, చిన్న సినిమా అనే టైటిల్ తో వచ్చిన సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్జున్ కళ్యాన్ ప్రస్తుతం బిగ్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నారు. మరోవైపు ఇదే బిగ్ బస్ సీజన్ లో క్యాలిఫ్లవర్, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో నడించిన వాసంతి క్రిష్ణన్ కూడా కంటెస్టెంట్ గా కొనసాగుతోంది.

హౌస్ లో జరుగుతున్ లవ్ ట్రాక్ గురించి నేహా, శ్రీహాన్ పలు విషయాలను మాట్లాడుకుంటారు. వీరిద్దరి సంభాషణను బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ లో ప్రదర్శించారు. శ్రీసత్య ఏది మాట్లాడినా వావ్.. సూపర్ అని అంటునే ఉంటాడు. అసలు అర్జున్, శ్రీసత్య మధ్య ఏం జరుగుతోంది అని నేహా అడుగుతుంది. అర్జున్ కి శ్రీసత్య మీద ఏదో ఫీలింగ్ ఉందని, కానీ శ్రీసత్య, అర్జున్ ని పట్టించుకోవడం లేదని శ్రీ హాన్ చెబుతాడు. మరి వాసంతి పట్ల కూడా అర్జున్ అలాగే బిహేవియర్ చూపిస్తున్నాడని నేహా అంటోంది.
నాకు అలాగే కనిపించిందని శ్రీహాన్ అంటాడు. ఏంటి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా… డబుల్ గేమ్ నడుస్తోందా హౌస్ లో అంటూ నేహ తన సందేహం వెలిబుచ్చుతోంది. కొన్ని కంట్రోల్ చేసుకోరా అని చెప్పాను.. ఎప్పుడు శ్రీసత్య అన్నయ్య అని అర్జున్ ని హర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని శ్రీహాన్ తాను గమనించిన విషయాలను చెబుతాడు. అయితే హౌస్ లో షో కోసం వాళ్లు ఇలా చేస్తున్నారని కూడా అనిపిస్తోందంటూ నేహ మరో మెలిక పెడుతోంది. మరి నేహా చెప్పినట్లు హౌస్ లో నిజంగానే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా… కేవలం షో కోసం ఇలా చేస్తున్నారా అనేది చూడాలి..!