డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే 23న జరగనుంది. ఈ పుట్టిన రోజు కోసం ఇప్పటికే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఏపీలో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు చేయాలని అనుకుంటున్నారు. అలాగే ప్రభాస్ బిల్లా మూవీ 4కెని ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలుగా వేస్తున్నారు. రీసెంట్ గా రెబల్ రీరిలీజ్ చేసి స్పెషల్ షోలు వేశారు.ఇప్పుడు బిల్లా స్పెషల్ షోకి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి స్పెషల్ గా ట్రీట్ ఇవ్వడానికి ఆయన నటిస్తున్న సినిమా దర్శకులు సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా నుంచి పుట్టిన రోజు సందర్భంగా చిన్న ట్రీట్ ఉంటుందని ట్విట్టర్ లో నాగ్ అశ్విన్ కన్ఫర్మ్ చేశారు.
ఒక ఫ్యాన్ నాగ్ అశ్విన్ ని టాగ్ చేసి ప్రాజెక్ట్ కె నుంచి ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నావా అని అడిగారు. దానికి కచ్చితంగా ఓ స్మాల్ ట్రీట్ ఉంటుందని చెప్పాడు. అయితే ఈ సారి మళ్ళీ చెయ్యి చూపించకుండా కొత్తగా ఇంకేదైనా చూపించాలని నెటిజన్స్ కౌంటర్లు పేలుస్తున్నారు. అలాగే మారుతి సినిమాకి సంబందించిన ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిన నేపధ్యంలో ఆ మూవీ నుంచి కూడా ఫస్ట్ లుక్ లేదంటే టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
అలాగే సలార్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ని ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఉండబోతుందని సమాచారం. దాంతో పాటు ఆదిపురుష్ నుంచి ఒక సాంగ్ ని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ చేతిలో ఉన్న నాలుగు సినిమాల నుంచి పుట్టినరోజు సందర్భంగా అప్డేట్స్ ఉంటాయని సమాచారం. ఫ్యాన్స్ కూడా ఈ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.