Tom Cruise: ప్రయోగాలకు హాలీవుడ్ సినీ లోకం ఎప్పుడూ ముందు ఉంటుంది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో సినిమాల కోసం కొంతమంది ప్రాణం పెడుతుంటారు. అలాంటి వారిలో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. 60 ఏళ్ల వయసులోనూ ఎవరూ చేయని విధంగా సాహసాలు చేస్తూ.. తన సినిమాలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. విదేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా టామ్ క్రూజ్ చేసిన సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది.
మిషన్ ఇంపాజిబుల్, టాప్ గన్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టామ్ క్రూజ్ ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరచబోతున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలతో అందరినీ అలరించిన టామ్ క్రూజ్.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ప్రపంచంలో మొదటిసారిగా అంతరిక్షంలో సినిమా చేయడానికి టామ్ క్రూజ్ సిద్ధమైపోయాడు.
దర్శకుడు డగ్ లీమన్ దర్శకత్వంలో టామ్ క్రూజ్ ఈ సినిమా చేయనుండగా.. షూటింగ్ మొత్తం అంతరిక్షంలోనే జగరనుంది. నాసా కేంద్రం, ఎలాన్ మస్క్ లు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో జరగనుంది. ఈ సినిమా నిర్మించడానికి 200 మిలియన్ డాలర్లు అవుతుందని అంచనా వేయగా.. అందులో 60 మిలియన్ డాలర్లను టామ్ క్రూజ్ తన రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు.
Tom Cruise:
ఇప్పటి వరకు అంతరిక్షంలోకి సైంటిస్టులు కేవలం తమ పరిశోధనలకై వెళ్లగా.. మొదటిసారి సినిమా షూటింగ్ కోసం టామ్ క్రూజ్ అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇది ప్రపంచంలో గతంలో ఎప్పుడూ జరగకపోగా.. ఈ సినిమాతో టామ్ క్రూజ్ ఎన్ని రికార్డులను, అద్భుతాలను సృష్టిస్తాడనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాకు చెందిన ఈ యాక్టర్.. ఇప్పటి వరకు చేసిన మిషన్ ఇంపాజిబుల్, మమ్మీ, జాక్ రిచర్, ఎడ్జ్ ఆఫ్ టుమారో, అమెరికన్ మేడ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ మెప్పించడం తెలిసిందే.