టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం వందలాది చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వస్తాయి. అయితే వాటిలో ప్రేక్షకుల ప్రశంసలు సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచేవి కొన్నే ఉంటాయి. కలెక్షన్స్ పరంగా, ప్రేక్షకుల మన్నల పరంగా హిట్స్ లిస్ట్ లలోకి వెళ్లే సినిమాలు పదుల సంఖ్యలోనే ఉంటాయి. అలాగే సినిమాలతో వందలాది మంది దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వారిలో లక్ ఫ్యాక్టర్ కలిసివచ్చేది కొంత మందికే. అలా కలిసివచ్చిన అదృష్టంతో స్టార్ దర్శకులుగా మారిన వారు ఉన్నారు. అలాగే ముందుగా సక్సెస్ అందుకొనితరువాత కనుమరుగు అయిన దర్శకులు కూడా ఉన్నారు.
అలా 2010 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలం పాటు మన తెలుగు చిత్రాల జాబితా చూసుకుంటే వేళల్లో ఉంటాయి. అయితే వాటిలో బెస్ట్ క్లాసిక్ మూవీస్ గా అత్యుత్తమ రేటింగ్స్, ప్రేక్షకుల ఓటింగ్ సొంతం చేసుకున్న సినిమాలు కొన్నే ఉంటాయి. ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే ఉత్తమ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో కేరాఫ్ కంచరపాలెం ఉండటం విశేషం. ఈ సినిమా ఏకంగా 8.9 రేటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దీని తర్వాత కీర్తి సురేష్ కథానాయికగా నటించిన మహానటి సినిమా నిలవడం విశేషం. ఈ మూవీకి 8.5 రేటింగ్ ఉంది. వీటి తర్వాత శర్వానంద్ ప్రస్థానం(8.3), బాహుబలి-2(8.2), రంగస్థలం(8.2), పెళ్లిచూపులు(8.2), మత్తు వదలరా(8.2), క్షణం(8.2), వేదం(8.1). బాహుబలి-1(8) రేటింగ్స్ తో టాప్ 10 చిత్రాలుగా ఉన్నాయి.
ఈ సినిమాలు దశాబ్ద కాలంలో కలెక్షన్స్ పరంగా, ప్రేక్షకాదరణ పరంగా అత్యుత్తమ చిత్రాల జాబితాలో నిలవడం విశేషం. అయితే వీటిలో వేదం సినిమా అయితే రిలీజ్ సమయంలో ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కాని దశాబ్దకాలం అత్యుత్తమ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. వీటి తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా 11వ స్థానంలో ఉండటం విశేషం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం కేరాఫ్ కంచరపాలెం. టాప్ 10 చిత్రాలన్నింటిలోకి అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమే కాకుండా అందరూ కొత్త నటులతో ప్రయోగాత్మక కథ, కథనంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి అద్బుతమైన స్పందన సొంతం చేసుకోవడం విశేషం.