బాహుబలి పుణ్యాన టాలీవుడ్ క్రేజ్ సౌత్ ఇండియాలోనే కాక నార్త్ ఇండియాలో కూడా పెరిగింది.రీసెంట్ టైంలో సౌత్,నార్త్ ఇండస్ట్రీలలో వాళ్ళ చిత్రాల కంటే మన చిత్రాలకే యుట్యూబ్ లో ఆదరణ ఎక్కువగా దొరుకుతుంది.ఇప్పటివరకు యుట్యూబ్ లో సౌత్ ఇండియాకు సంబంధించి విడుదలైన వీడియో సాంగ్స్ 24 గంటలలో అతి ఎక్కువ వ్యూస్ సాధించిన లిస్ట్ లో తెలుగు చిత్రాలకే సినీ అభిమానులు పట్టాం కట్టారు.
ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఆర్.ఆర్.ఆర్ మూవీ జనని 6.5 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో నిలవగా,6.1 మిలియన్ వ్యూస్ తో అఖండ మూవీలోని జై బాలయ్య సాంగ్ రెండవ స్థానంలో నిలిచింది.మారి 2 నుండి రౌడీ బేబీ సాంగ్ 6 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానంలో,కన్నడ మూవీ పొగరులోని కరాబు సాంగ్ 5.5 మిలియన్ వ్యూస్ తో నాలుగవ స్థానంలో,5.4 మిలియన్ వ్యూస్ తో బన్నీ బుట్ట బొమ్మ ఐదవ స్థానంలో నిలిచాయి.