టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు సినిమా బడ్జెట్ ని తగ్గించుకునే క్రమంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక దీని కోసం ఏకంగా నెల రోజుల పాటు షూటింగ్స్ కూడా ఆపేసి చర్చలు జరిపారు. దీనిలో భాగంగా కీలకమైన నిర్ణయాలని ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు. కాస్ట్ కటింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రెమ్యునరేషన్స్ విషయంలో పెద్దగా కోతలు పెట్టకపోయిన అనవసరమైన ఖర్చులు తగ్గించేసుకోవడంలో మాత్రం నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నటులకి, అలాగే సాంకేతిక నిపుణులకు నిర్దిష్టమైన రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేశారు. ఆ రెమ్యునరేషన్ కి మించి ఒక్క రూపాయి కూడా ఎక్స్ ట్రా ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చేసారు.
అలా ఒకే అనేవారికి మాత్రమే ఛాన్స్ లు ఉంటాయి. మధ్యలో రెమ్యునరేషన్ పెంచడం వంటివి ఇకపై ఉండవు. హీరో, హీరోయిన్స్ కి ఇచ్చే రెమ్యునరేషన్ లోనే వాళ్ళ అసిస్టెంట్ లు, పెర్సనల్ మేకప్ మెన్ లు, ట్రావెలింగ్ చార్జీలు, వాళ్ళకి సంబందించిన అనవసరమైన ఖర్చులు అన్ని కూడా వారి రెమ్యునరేషన్ నుంచి మాత్రమే వారి పెర్సనల్ ఖర్చులు అన్ని భరించాలి. హోటల్ కి సంబందించిన ఖర్చులు కూడా వారి రెమ్యునరేషన్ నుంచి మాత్రమే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలలో నటించడానికి హీరోయిన్స్ అనవసరమైన కండిషన్స్ అని పెడుతూ ఉంటారు. అలాగే నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా ఎక్స్ ట్రా గా చాలా రకాలుగా డబ్బులు లాగే ప్రయత్నం చేస్తారు.
దీనికి చెక్ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అలాగే కొంత మంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కోసం మళ్ళీ ఎక్స్ ట్రాగా మని అడుగుతూ ఉంటారు. ఒక్కసారి రెమ్యునరేషన్ తీసుకొని సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ప్రమోషన్ పూర్తయ్యి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలలో వారు భాగం కావాల్సిందే. ఇలాంటి కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకుంటేనే హీరోయిన్స్ కి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో నిర్మాతలు చాలా కఠినంగా వ్యవహరించడానికి రెడీగా ఉన్నారు. హీరోలకి కూడా ఇదే రూల్ వరిస్తుంది అని ప్రొడ్యూసర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.