చిత్ర పరిశ్రమకి ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు అయితే వారిలో కొంత మందికి మాత్రమే స్టార్ హీరోయిన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి భామలు ఒక్క సినిమాతోనే తామెంటో పరిచయం చేసుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. తన అందంతో, నటనతో, గ్రేస్ తో ప్రేక్షకుల మనస్సుని కొల్లగోడతారు. అలాగే దర్శక, నిర్మాతల బెస్ట్ ఛాయస్ గా మారిపోతారు. అలా అందరి దృష్టిని ఆకర్షించి స్టార్ హీరోయిన్ అవుతుందనే ఐడెంటిటి తెచ్చుకున్న భామలు 2022లో ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ ఏడాది చాలా మంది కొత్త హీరోయిన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. అలా ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన భామలు అంటే మొదటి పేరు మృణాల్ ఠాకూర్ ది ఉంటుంది.
సీతారామం సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులనే కాకుండా సౌత్ ఇండియా ఆడియన్స్ అందరిని తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది. ఈ సినిమా మృణాల్ ఠాకూర్ కి ఏకంగా పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. అలాగే తెలుగులో ఏకంగా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశం అందిస్తుంది. అయితే ఆమెకి తెలుగు నుంచి భారీగానే ఆఫర్స్ వస్తున్న ఆచితూచి సినిమాలని ఎంపిక చేసుకుంటుంది. తెలుగులో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్న బ్యూటీగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తుంది. ఇక తరువాత శ్రీలీల ఉంది. ఈ బ్యూటీ గత ఏడాది పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
మొదటి సినిమా నిరాశ పరిచిన అందులో ఆమె ఎనర్జిటిక్ యాక్టింగ్, బ్యూటీకి అందరూ కనెక్ట్ అయిపోయారు. అయితే రెండో సినిమాని మాస్ మహారాజ్ రవితేజతో చేసే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కి రవితేజ కూడా ఫ్యాన్ బాయ్ అయిపోయాడు. ఇక దర్శకుడు సైతం శ్రీలీలపై పొగడ్తలు కురిపించేశారు. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. మరో వైపు స్టార్ హీరోలకి జోడీగా ఛాన్స్ లు వస్తున్నాయి. తెలుగులో నెక్స్ట్ రూల్ చేయబోయే స్టార్ హీరోయిన్స్ జాబితాలో శ్రీలీల కచ్చితంగా ఉంటుందని అందరూ చెబుతున్నారు. ఇక బాలీవుడ్ నుంచి అలియా భట్, అనన్యా పాండే, సాయీ మంజ్రేకర్ ఈ ఏడాది తెలుగులో తమ అదృష్టం పరీక్షించుకున్నారు.