Tollywood Movies: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఏదైనా పండుగ వచ్చిందంటే పెద్ద ఎత్తున సినిమాలు పండుగ బరిలో దిగి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే పండుగ వస్తుందంటే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొంటుంది.పలువురు హీరోల అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు కట్టడం పాలాభిషేకాలు చేయడం చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంటారు. అయితే కరోనా వచ్చిన తర్వాత థియేటర్ల వద్ద ఈ కోలాహలం పూర్తిగా కనుమరుగైపోయింది.
ఇప్పుడిప్పుడే థియేటర్ వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో అభిమానులు సైతం థియేటర్లకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారు.ఇక తాజాగా దసరా పండుగ రానున్న నేపథ్యంలో దసరా బరిలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు బడా హీరోలు పోటీకి సై అంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదలవుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచడమే కాకుండా త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది.ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకి పోటీగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tollywood Movies: విజయదశమి ఎవరికి విజయాన్ని ఇస్తుందో…
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఈ సినిమా కూడా అక్టోబర్ 5వ తేదీ విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈ దసరా పండుగ బరిలో నాగార్జున చిరంజీవి పెద్ద ఎత్తున పోటీకి దిగబోతున్నారు. మరి ఈ బరిలో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటారు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠత ఏర్పడింది. మరి విజయదశమి రోజు ఏ హీరో విజయాన్ని సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.