‘Tollywood Heroine: ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. బిగ్ డైరెక్టర్ శంకర్ తో ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న రామ్ చరణ్.. అది ముగిసిన తర్వాత ఓ క్రేజీ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఓ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.
ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సన.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేద్దామని ప్లాన్ చేయగా.. అది వర్కవుట్ కాలేదు. దీంతో అదే కథను తన ఫ్రెండ్ రామ్ చరణ్ కు చెప్పాలని బుచ్చిబాబుకు యంగ్ టైగర్ సలహా ఇచ్చాడట. రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఓసారి కథ వినాలని కూడా ఎన్టీఆర్ చెప్పాడట. దాంతో రామ్ చరణ్ కథ వినగా.. దానికి ఓకే చెప్పాడట.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీపొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బుచ్చిబాబు సన.. రామ్ చరణ్ పక్కన తాను ఏ హీరోయిన్ ని అనుకుంటున్నాడో అనే దానిపై వార్తలు వస్తున్నాయి. క్రేజీ కాంబో అయిన బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాలో క్రేజీ బ్యూటీని ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తోంది. తక్కువ సినిమాలే చేసినా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే కృతి శెట్టి అని తెలుస్తోంది.
‘Tollywood Heroine:
ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కన్నడ భామ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. బుచ్చిబాబు సన డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమాతో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం కాగా.. తన రెండో సినిమాకు కూడా బుచ్చిబాబు ఈమెనే హీరోయిన్ గా అనుకుంటున్నాడట. ఆమె అయితే సినిమా కథ పరంగా బాగా సెట్ అవుతుందని, అలాగే యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని బుచ్చిబాబు ప్లాన్ చేశాడట.