Tolly wood Directors: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలో ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలాంటి రంగు మారుతాయో ఎవరికి తెలియదు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతోమంది హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతల తలరాతలు ఒక్క రాత్రిలో తారుమారవుతూ ఉంటాయి.ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ వివి వినాయక్ వంటి డైరెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ ఇద్దరు డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా సూపర్ హిట్ సినిమాలతో పాటు వీరి ఖాతాలో డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.అయితే డైరెక్టర్ అన్న తర్వాత హిట్ ప్లాపులు రావడం సర్వసాధారణం.ఇలా ఈ డైరెక్టర్లు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే ఒక సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పొచ్చు.
ఇలా ఇండస్ట్రీలో ఫ్లాపులతో పాటు హిట్టు కూడా అందుకొని కొనసాగుతున్న ఈ డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో మంచి సరైన హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు డైరెక్టర్లను ఇండస్ట్రీలో ఫ్లాప్ డైరెక్టర్లుగా పరిగణిస్తున్నారు. కానీ కొందరు మాత్రం వీరిలో ఎంతో అద్భుతమైన టాలెంట్ దాగి ఉందని ఈ ఇద్దరి డైరెక్టర్లు ఎంతోమంది స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చారని భావిస్తున్నారు.
Tolly wood Directors: స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్..
ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి హీరోలకు ఈ ఇద్దరు డైరెక్టర్లు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చారు. కనుక వీరిలో కూడా టాలెంట్ ఉందని అయితే కొన్నిసార్లు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఇలాంటి ఫ్లాప్స్ రావడం సర్వసాధారణమేనని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.