Tollywood: సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది.కొన్నిసార్లు మల్టీ స్టార్ సినిమాలు ట్రెండ్ అయితే మరికొన్నిసార్లు బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటుల బయోపిక్ చిత్రాలను, రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాలను, అదేవిధంగా ప్రముఖ క్రీడాకారుల బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ విధంగా ఇప్పటికే ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి అయితే వీటిలో సక్సెస్ అయిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పాలి. అన్ని బయోపిక్ చిత్రాలు హిట్ కావని ఏ కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవుతాయని నిరూపించాయి. ఇక మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎంతో మంచి విజయం అందుకుంది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంగా కథానాయకుడు సినిమాని చేశారు.
Tollywood: హిట్ కన్నా ఫ్లాప్ సినిమాలే అధికం..
ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి నటి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా కూడా పెద్దగా హిట్ కాలేక పోయింది. ఎక్కువ భాగం సక్సెస్ అయిన సినిమాలు కన్నా ఫ్లాప్ అయిన సినిమాలే అధికంగా ఉన్నాయి.అయితే ఈ చిన్న లాజిక్ మిస్ అయిన నిర్మాతలు బయోపిక్ సినిమాలంటూ భారీగా ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.ఇప్పటికైనా నిర్మాతలు ఈ విషయంలో మేల్కొని సరైన సినిమాలను చేస్తేనే హిట్ అయ్యి సక్సెస్ అందుకుంటారని లేదంటే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాలి.