Surekha Vani: సురేఖ వాణి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. సినిమాలలో తల్లి, అక్క, భార్య, వదిన ఇలా అన్ని పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా సురేఖ వాణి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్ల తో కలిసి నటించిన విషయం తెలిసిందే. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలదు. అయితే మొదట టీవీ సీరియల్స్ తో కెరీర్ ఆరంభించిన ఈమె తర్వాత వెండితెర పై ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచుయాక్టివ్ గానే ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుంది అంటే తరచుగా ఎక్కువగా వార్తల్లో నిలిచే వారిలో ఈమె పేరు కూడా ఉంటుంది. తరచూ సురేఖ వాణి కి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తన కూతురుతో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
నాలుగు పదుల వయసులో కూడా తన కూతురుతో పాటు అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటో లను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే సురేఖ వాణి సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులర్ అవడంతో పాటు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అలాగే ఆమె తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుంది అంటే తన కూతురు సుప్రీత న్ని పక్కపక్కన నిలబెడితే తన కూతురు కంటే ఈమెని ఎక్కువ అందంగా కనిపించే విధంగా ఈమె తన ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.
అయితే చాలామంది సురేఖ వాణి అభిమానులను వేధిస్తున్న ప్రశ్న సురేఖ వాణికి భారీగా ఆస్తులు ఉన్నాయా? దీనికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సురేఖ వాణి ఒక్కొక్క సినిమాకు దాదాపు పది లక్షల పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఈ మధ్య తనకు సోషల్ మీడియా పాపులారిటీ కూడా రావడంతో ఇంకా ఎక్కువే డిమాండ్ చేస్తోందట. అంతే కాకుండా సినిమాల ద్వారానే ఈమె ఇప్పటి వరకూ దాదాపుగా పదికోట్లకు పైనే ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇక కేవలం సినిమాల ద్వారా నే కాకుండా సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కూడా తల్లీకూతుళ్లు భారీగానే సంపాదిస్తున్నారని సమాచారం. ఇక ఇప్పుడు సినిమాలు చేయకపోయినా ఉన్నదానితో ఎంజాయ్ చేస్తుందట సురేఖ వాణి. అలాగే సోషల్ మీడియాలో పలు రకాల అడ్వర్టైజ్మెంట్లు, పోస్ట్ లు చేయడం కోసం కూడా భారీగానే డబ్బులు అర్జిస్తోందట.