Tolly wood Heroes: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వివిధ భాషలలో ఎన్నో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు.ఇలా ఒక భాషలో హిట్ అయిన సినిమా రీమేక్ హక్కులను మరొక భాషలో కొనుగోలు చేసి ఆ సినిమాలను రీమేక్ చేస్తూ పెద్ద ఎత్తున విడుదల చేస్తుంటారు. ఇలా ఎన్నో సినిమాలు ఒక భాష నుంచి మరొక భాష లోకి రీమేక్ అవుతూ మంచి విజయాలను అందుకున్నాయి.
ఈ క్రమంలోనే ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మలయాళ భాషలో తెరకెక్కిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే మలయాళం లో ఎంతో మంచి హిట్ అందుకున్న అయ్యప్పనుకోసియన్ సినిమాని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాగా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయం అందుకుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని మలయాళంలో డబ్ చేసి తిరిగి మలయాళంలో విడుదల చేయడమే కాకుండా అక్కడ కూడా మంచి టాప్ సొంతం చేస్తుంది.
ఇలా మలయాళంలోని మరొక సూపర్ హిట్ అందుకున్నటువంటి లూసీ ఫర్ చిత్రాన్ని ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Tolly wood Heroes: గాడ్ ఫాదర్ తో మెగాస్టార్ హిట్ కొడతారా..
మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు మలయాళంలో తెరకెక్కిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ తెలుగు హీరోలు మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళ రీమేక్ చిత్రం కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందోనని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.