బొగ్గు ఆధారిత కరెంట్ పై ఆధారపడి ఉన్న దేశాలలో ఒకటైన భారత్ ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మూడింతలు పెరగడం,బొగ్గు ప్రొడక్షన్ తక్కువగా ఉండడంతో ఇప్పుడు కరెంట్ కోతలను ఎదుర్కొబోతుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భారత్ దీన్ని నివృత్తి చేసేందుకు చర్యలు చేపడుతుంది.
అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా ప్రొడక్షన్ పెంచమని ఆదేశాలు జారీ చేసింది.వరదల వల్ల భారత్ లో మందగమనం పట్టిన కోల్ ప్రొడక్షన్ ను ప్రస్తుతం గాడిలో పెట్టేందుకు కోల్ ఇండియా చర్యలు చేపడుతుంది.అందుకే రానున్న 3 రోజుల పాటు 1.6 మిలియన్ టన్నులు బొగ్గును ఆ తర్వాత రోజుకు 1.7 మిలియన్ టన్నులు సరఫరా చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చింది.దానికి తగిన ఏర్పాట్లను కోల్ ఇండియా చేసుకుంటుంది.