ప్రస్తుతం ఫుడ్ ఐటమ్స్ కల్తీ ఎక్కువగా జరుగుతుంది.ఈ కల్తీ ఎక్కువగా భారతదేశంలోనే జరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి.అలాంటి మన వంటింట్లో ముఖ్య పదార్థాలలో ఒకటైన పసుపు కల్తీనా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా గ్లాస్ నీళ్ళు తీసుకోని అందులో చెంచాడు పసుపు వేయండి.ఆ పసుపు కల్తీ అయితే చాలావరకు పసుపు కరిగిపోతుంది.అలాగే నీరు ముదర పసుపు రంగంలోకి మారిపోతుంది.అదే పసుపు కల్తీ కాకుంటే ఆ పసుపు గ్లాసు అడుగు భాగానికి చేరిపోతుంది.నీరు పసుపు లేత రంగులోకి మారుతుంది.పసుపు కల్తీనో కాదో తెలుసుకోవడం కోసం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ వారు ఈ విధానాన్ని వినియోగిస్తారు.