మహబూబాబాద్ దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది.ఈ కోతులు ఇంట్లో చొరబడి చేతికి దొరికిన వాటిని ఎత్తుకెళ్తూ స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాయి.వీటి బెడదకు చెక్ పెట్టేందుకు ఈ గ్రామంలోని కూరపాటి యాకన్న రెండు వేల రూపాయిలు ఖర్చు చేసి ఒక పులి బొమ్మను కొనుగోలు చేసి ఆ బొమ్మను ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు తన కిరాణ దుకాణం ముందు పెడుతున్నాడు.
దీంతో అటు వైపు వచ్చిన కోతులు ఆ పులి బొమ్మను చూసి నిజమైన పులి అనుకొని పరుగులు పెడుతున్నాయి.తను చేసిన వినూత్న ఆలోచన తన సమస్యను తీర్చిందని యాకన్న చెబుతున్నారు.