ప్రస్తుతం పెళ్లి చేసుకొని అబ్రాడ్ షిఫ్ట్ అయిపోయిన శ్రియ శరణ్ త్వరలో గమనం మూవీతో ప్రేక్షకులను పలకరంచనున్నది.గత ఏడాది నవంబర్ లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఈ మూవీలో శ్రియ భర్త వదిలేసిన మూగ అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ మూవీలో శ్రియతో పాటు నిత్యామీనన్,ప్రియాంక జవల్కార్ లు నటిస్తున్నారు.సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందించిన ఈ మూవీతో సుజనా రావు అనే నూతన దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
హైదరాబాద్ వరదల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.