Politics: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ పార్టీ ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. జాతీయ పార్టీ పెట్టేందుకు ఇప్పటికే కేసిఆర్ వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలతో సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో మరింత క్రియాశీకంగా జాతీయ రాజకీయాలను చేసేందుకు కేసిఆర్ సిద్దం అయ్యారు.
ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో పర్యటన చేసేందుకు కేసిఆర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు దసరా పర్వదినం నాడు జాతీయ పార్టీ ప్రకటన గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు ఇప్పటికే కన్ ఫార్ట్ అయింది. కేంద్రంపై పోరాటం చేసేందుకు కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఓ వైపు కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సానుకూల స్పందన వస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలువురు కేసిఆర్ స్థాపించనున్న జాతీయ పార్టీలోకి వెళ్లనున్నట్లు ప్రచారం మొదలైంది. ఇందులో ముందుగా రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు జేసి బ్రదర్స్ పేరు వినిపిస్తోంది. అనంతరం జిల్లాలో జేసి బ్రదర్స్ హవా అంతా ఇంతా కాదు. ఎన్నికల్లో ఓడిపోయినా రాజకీయంగా నిలదొక్కుంటున్నారు.
జేసి బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే..! అయినప్పటికీ పలుమార్లు టీడీపీ తీరుపట్లు పలు మార్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఇక వైసీపీకి జేసి బ్రదర్స్ కి మధ్య ఉన్న వైరం తెలుగు రాష్ట్ర ప్రజలకి తెలిసిన తెలుసు. అప్పుడప్పుడు జేసి దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో కూడా సందడి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో జేసి బ్రదర్స్ ఖచ్చితంగా కేసిఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీలోకి వెళ్లనున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!