ఈ ఏడాది తెలుగు తెరకు హీరోలుగా,హీరోయిన్ లుగా పరిచయమై మొదటి ప్రయత్నంతోనే ప్రేక్షకులను మెప్పించి ఓవర్ నైట్ స్టార్స్ అయిన కొందరి గురించి ఇప్పుడు చూద్దాం.
మెగా కాంపౌండ్ నుండి తెలుగు తెరకు ఈ ఏడాది పరిచయం అయిన హీరో వైష్ణవ్ తేజ్.తొలి మూవీ ఉప్పెన తో సంచలనం సృష్టించాడు.ఈ మెగా మేనల్లుడు తన నటనతో సినీ అభిమానులను ఆకట్టుకున్నాడు.క్రిష్ దర్శకత్వంలో కొండపొలం మూవీతో ప్రేక్షకులు ముందుకొచ్చిన వైష్ణవ్ తన రెండో ప్రయత్నంలో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాలలో నటించిన తేజ సజ్జా సమంత ఓ బేబీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి కనువిందు చేశాడు.ఈ ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబి రెడ్డి మూవీతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన తేజ సజ్జా.మొదటి మూవీతో ప్రేక్షకులను అలరించాడు.ఇక ఇష్క్ మూవీతో తన రెండవ ప్రయత్నంలో విఫలం చెందిన తేజ సజ్జా.ఆతర్వాత అద్బుతం మూవీతో పర్వాలేదనిపించాడు.
ఇక ఈ ఏడాది మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో పాటు తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది.తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ఏడాది మొదట్లో ఉప్పెన మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏడాది చివరిలో నాని శ్యామ్ సింగ్ రాయ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాన్నుంది.
నవీన్ పోలిశెట్టి,రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన జాతిరత్నలు మూవీతో తెలుగు తెరకు పరిచయమైన హైదరాబాద్ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా ఉరఫ్ చిట్టి కుర్రకారు మనసుని దోచింది.ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈమె త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా కేతిక శర్మ,శ్రీలీల,మీనాక్షి చౌదరి,అమృత అయ్యర్‌ల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీలలో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మలు త్వరలో ప్రేక్షకులను అలరించడానికి బ్యాక్ టు బ్యాక్ మూవీలలో రానున్నారు.