Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు 5 వ వారం కూడా పూర్తి కావడానికి వచ్చింది. ఈ రోజుతో ఓటింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. ఈ రోజు నైట్‌తో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది తేలి పోతుంది. నేటి ఉదయం వరకూ జరిగిన ఓటింగ్ ప్రకారం ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్.. షానీ, అభినయ శ్రీ, నేహా, ఆరోహిలు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఓటింగ్‌లో టాప్ ఉన్న కంటెస్టెంట్ నుంచి డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఓటింగ్ విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు.
ఈ వారం ఎవరైనా ఎలిమినేట్ కావొచ్చు. ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలి రెండు రోజులు టాప్‌లో ఉన్న ఇనయ సుల్తానా సూర్యపై క్రష్ ఉందని చెప్పడంతో దెబ్బకు పడిపోయింది. మూడో స్థానానికి పడిపోయింది. కాగా.. నేడు తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో ఫైమా ఉంది. గత మూడు రోజులుగా ఫైమా తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగింది. ఒక్కసారిగా ఫైమాకు ఓటింగ్ పెరిగింది. ఎంత పెరిగినా కూడా కేవలం 15 శాతంతో ఫైమా టాప్‌లో ఉంది.
14 శాతంతో ఇనయ రెండో స్థానంలో ఉంది. ఆదిరెడ్డి కూడా కాస్త అటో సేమ్ ఓటింగ్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అర్జున్ అనూహ్యంగా మూడో స్థానానికి వచ్చేశాడు. శ్రీసత్య ఓటింగ్ కూడా అర్జున్‌కు పడుతోందని టాక్. లీస్ట్‌లో ఉన్న బాలాదిత్య ఐదవ స్థానానికి వచ్చాడు. ఆ తరువాతి స్థానంలో వాసంతి, మెరీనా ఉన్నారు. వీరిద్దరి తరువాత లీస్ట్‌లో చంటి ఉన్నాడు. హోస్ట్ నాగార్జున ఎంత చెప్పినా లైట్ తీసుకోవడం.. కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ జోలికి కూడా వెళ్లకపోవడం వంటివి చంటికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చంటికి ఏమాత్రం ఓటింగ్ పెరగలేదు. దీంతో లీస్ట్‌లోనే ఉండిపోయాడు. ఈవారం చంటికి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.