Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు నేడు 6 వ వారంలోకి అడుగు పెట్టింది. ఈ రోజు వారంలోనే మహత్తర ఘట్టం అదేనండీ.. నామినేషన్స్ ఇవాళ జరగబోతున్నాయి. ఇక ప్రోమోను బట్టి చూస్తే నామినేషన్స్ మాంచి రంజుగానే జరగనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఆసక్తికర విషయం ఏంటంటే.. మన రేలంగి మామయ్య.. అదేనండి.. బాలాదిత్య కూడా వాదనకు దిగాడు. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న బాలాదిత్య ఇక నోరు విప్పకుంటే కుదరదని డిసైడ్ అయ్యాడో ఏమో కానీ.. మొన్న గీతూ మీద ఇవాళ నామినేషన్స్‌లో గట్టిగానే వాదనకు దిగాడని తెలుస్తోంది.
ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ముఖానికి ఫోమ్ రాసి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ సూచించారు. తొలుత వచ్చిన రేవంత్.. బాలాదిత్యను నామినేట్ చేశాడు.ముఖ్యంగా సుదీపతో ఒకరిద్దరికీ బాగానే పడిందని తెలుస్తోంది. సుదీప వచ్చేసి బాసిగా బిహేవ్ చేస్తోందని.. ఆమె కెప్టెన్ కాకున్నా.. కెప్టెన్‌లాగే బిహేవ్ చేస్తోందని కంటెస్టెంట్స్ భావిస్తున్నారు. ఇక ప్రోమోను బట్టి సుదీప వర్సెస్ రేవంత్ కాస్త గట్టిగానే పడింది. నిన్ మీరు నాకు ట్యాగ్ ఇచ్చారంటూ రేవంత్ మొదలు పెట్టగానే మళ్లీ అదే మాట్లాడకంటూ సుదీప కాస్త గట్టిగానే చెప్పేసింది.
ఇక కీర్తి, శ్రీ సత్యల మధ్య కూడా కాస్త గట్టిగానే ఆర్గ్యుమెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఆదిరెడ్డి మీరు చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అని ఇప్పటి వరకూ అనిపించింది. ఆ ఒపీనియన్ మార్చుకునేలా చేయవద్దని సూచించాడు. ఇక ఈ రోజు జరిగిన నామినేషన్స్‌లో 9 మంది ఉన్నారని సమాచారం. అయితే ఈ వారం రేవంత్ కెప్టెన్ అయినందున సేఫ్ అయ్యాడు.ఇక నామినేషన్స్‌లో ఇనయ సుల్తానా, శ్రీహాన్, కీర్తి భట్, ఆదిరెడ్డి, గీతూ, రాజ్, అర్జున్, బాలాదిత్య, సుదీప ఉన్నారు. మళ్లీ ఈ వారం 9 మందిని తీసుకొచ్చేసి నామినేషన్స్‌లో పడేవాడు బిగ్‌బాస్. ఇక చూడాలి ఏం జరుగుతుందో..