శుక్రవారం వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది.అందుకే ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి మొత్తం నాలుగు సినిమాలు వస్తున్నాయి వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రొమాంటిక్ :
ఎప్పటి నుండో వార్తలకు పరిమితమైన ఈ మూవీ చివరికి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నది.ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్న ఈ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు.పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ మూవీని పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
వరుడు కావలెను :
నాగశౌర్య,రీతూవర్మ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ‘వరుడు కావలెను’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నది.నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్,ట్రైలర్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తీరం :
అనిల్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న మూవీ తీరం.ఇందులో శ్రావణ మరో హీరోగా నటిస్తున్నాడు.క్రిస్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ తన ఫేట్ ను డిసైడ్ చేసుకోవడానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నది.
రావణ లంక :
బి.ఎన్.ఎస్.రాజు దర్శకత్వంలో క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటిస్తున్న రావణ లంక ఈవారం బాక్స్ ఆఫీస్ ముందుకు రానున్నది.ఈ మూవీలో మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించి కనువిందు చేయనున్నారు.