Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఆరో వారం నేటితో పూర్తి కానుంది.ఇవాళ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే ఆ ఎలిమినేషన్‌పై ఫుల్‌గా క్లారిటీ వచ్చేసింది. సుదీప ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నవారిలో బాగా తెలిసిన వ్యక్తుల్లో ఒకరు సుదీప. మరి అలాంటి సుదీప ఎందుకు ఎలిమినేట్ కావల్సి వచ్చింది? దానికి కారణాలేంటి? ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సుదీప. ఆమె బిగ్‌బాస్‌కి వస్తోందనగానే అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
కానీ సుదీప తొలి వారం అయితే అసలు కనిపించనే లేదు. ఆ తరువాతి వారం కనిపించినా వంట గదికే పరిమితమైంది. హోస్ట్ నాగార్జున క్లాసులు మీద క్లాసులు పీకుతుంటే కాస్త దారిలోకి వచ్చింది. కొద్దో గొప్పు గేమ్ ఆడటం ప్రారంభించింది.ముఖ్యంగా ఎక్కువగా కిచెన్‌కి స్టిక్ అయిపోవడం వల్ల ఆమె పెద్దగా కనిపించలేదు.మెయిన్ ఎపిసోడ్‌లో కిచెన్‌లో ఏదైనా గొడవ జరిగితే మాత్రమే చూపిస్తారు తప్ప లేదంటే అక్కడ చూపించడానికి ఏం ఉంటుంది? కంటెంట్ పరంగా సుదీప ఏం ఇవ్వలేక పోయింది.
అయితే ఇటీవలి కాలంలో మాత్రం కాస్త ఎక్కువగా బిచ్చింగ్ చేస్తూ కంటెంట్ ఇస్తోంది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేదు పైగా వాహ్ అనిపించే లాజికల్ ఆర్గ్యుమెంటూ లేదు. కేవలం రేవంత్‌నే టార్గెట్ చేస్తూ అదే పనిగా బిచ్చింగ్ చేయడంతో ఆమెకు బయట కావల్సినంత నెగిటివిటీ వచ్చింది. స్వయంగా ఆమె భర్తే ఎవరిపైనా గ్రడ్జ్ పెంచుకోకు అని చెప్పినా కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. రేవంత్‌ని కెప్టెన్సీ కంటెండర్ కానివ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేయడంపైనే దృష్టి సారించింది తప్ప తన గేమ్‌పై దృష్టి పెట్టలేదు.దీంతో సుదీపపై బాగా నెగిటివిటి వచ్చింది. మొత్తానికి ఆమె బయటకు రాక తప్పలేదు.