BIGG BOSS: మూడో వారంలో కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అయ్యేందుకు బిగ్ బాస్ ముందుగా అడవిలో ఆట అనే గేమ్ ను ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గేమ్ లో హౌస్ లో కంటెస్టెంట్స్ కొందరు దొంగలుగా, మరికొంతమంది పోలీసులుగా వ్యవహరించడం జరిగింది.. పోలీస్ టీంలో ఆది, ఇనయ, ఫైమా, మెరీన, శ్రీసత్య, చంటి, ఆదిత్య, రాజ్, రోహిత్ ఉండగా, దొంగల టీంలో రేవంత్, ఆరోహి, సుదీప, వసంతి, నేహా, కీర్తీ, శ్రీహాన్, సూర్య, అర్జున్ ఉన్నారు.
ఈ గేమ్ లో భాగంగా బిగ్ బాస్ ఆదేశాల మేరకు గీతూ అత్యాశ కలిగిన వ్యాపారస్తురాలిగా వ్యవహరిచింది మంచి ప్రదర్శన ఇచ్చింది. గేమ్ పూర్తి అయ్యాక బంగారు కొబ్బరి బోండం చేతిలో ఉన్న శ్రీసత్యతో పాటు అత్యాశ కలిగిన వ్యాపారస్తురాలిగా మంచి ప్రదర్శన చూపించిన గీతూని కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికయ్యారు. వీరితో పాటు పోలీసుల టీం నుండి ఆదిరెడ్డి, ఫైమా దొంగల టీం నుండి శ్రీహాన్ ఎంపిక అయ్యారు.

తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుడిగా ఉన్న వారికి టాస్క్ ఇస్తారు. ఇది రెండు లెవల్స్ లో జరుగుతుంది. మొదటి లెవల్ లో ఇస్తున్న టాస్క్ పేరు పిరమిడ్ కట్టు పడగొట్టు.. ఈ టాస్క్ లో పోటీదారులు వారికి కేటాయించిన టెబుల్స్ లో బ్రిక్స్ తో పిరమిడ్ కట్టాల్సి ఉంటుంది. ఎవరైతే కట్టలేక పోతారో వారు కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిపోతారు. తర్వాత రెండో బజర్ మోగిన వెంటనే మిగతా ఇంటి సభ్యులు ఎవరైతే కెప్టెన్ అవ్వడానికి అనర్హులని భావిస్తారో వారి పిరమిడ్ పై బాల్స్ విసరాల్సి ఉంటుంది.
అప్పుడు పోటీదారులు వారి పిరమిడ్ కూలిపోకుండా కాపాడుకోవాలి. ఎండ్ బజర్ మోగే సరికి ఎవరి టెబుల్ పైన తక్కువ బ్రిగ్స్ మిగిలి ఉంటాయో వారు పోటీ నుండి తొలగిపోతారు. ఈ టాస్క్ లో రేవంత్ సంచాలకుడిగా వ్యవహరించారు. ఈ టాస్క్ లో మొదటి లెవల్ లోనే గీతూ టాస్క్ నుండి తొలగిపోతుంది. తర్వాత రెండో లెవల్ లో ఫైమా తొలగిపోవాల్సి వస్తుంది. ఇక ఈ టాస్క్ లో ఆదిరెడ్డి, శ్రీసత్య, శ్రీహాన్ ముగ్గురు మిగిలారు. వీరికి తర్వాత బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇస్తారు.. చివరకు ఎవరు కెప్టెన్ అవుతారు అనేది మున్ముందు ఎపిసోడ్స్ చూడాలి..!