పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో “తమ్ముడు” సినిమాకు ఒక ప్రత్యేకమైన రేంజ్ ఉంది. పవన్ కళ్యాణ్ కు సూపర్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా నే “తమ్ముడు”. అలానే, ఈ సినిమా కామెడీ ట్రాక్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ కామెడీ ట్రాక్ కి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి ఏమి కాదు. ఈ ట్రాక్ తాలూకు పిక్స్ ను మీమ్స్ కి కూడా వాడుతూ ఉండేవారు
ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటించిన “ప్రీతి జింగానియా” గుర్తున్నారా?మీకు “పెదవి దాటని మాటొకటి ఉంది.. తెలుసుకో సరిగా” అన్న పాటని అంత ఈజీ గా మర్చిపోలేం కదా . అలాగే ప్రీతిని కూడా. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ప్రీతీ తమ్ముడు సినిమా తరువాత ఇతర స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించారంట . బాలకృష్ణ, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల పక్కన నటించి మంచి మార్కులనే కొట్టేసారు.

తెలుగులోనే కాకుండా.. ఇతర భాషా చిత్రాలలో కూడా నటించి మంచి పేరు ను సంపాదించుకున్నారు ప్రీతీ జింగనియా. ప్రీతీ తన కెరీర్ మంచి ఊపు అందుకున్న టైం లోనే నటుడు పర్విన్ దబ్బాస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట . పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పర్వీన్, ప్రీతీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలతో సినిమాలకు దూరమైన ప్రీతీ.. సోషల్ మీడియా కి వచ్చాక.. తన అభిమానులకు అందుబాటులోకి వచ్చేసారు . అప్పటికీ ఇప్పటికీ ఆమెలో చాలా మార్పులు ఉన్నాయి . బరువు పెద్దగా పెరగకపోయినా.. ముఖంలో మునుపటి కళ కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేసారు . తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ప్రీతీ కఫాస్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అవకాశం వస్తే.. తెలుగు సినిమాల్లో కూడా నటిస్తారేమో వేచి చూడాలి.