Biggboss 6 : బిగ్‌బాస్ షోలో తొలి రోజు ఇచ్చిన టాస్కే రెండవ రోజు కూడా కొనసాగింది. పలు రకాల గేమ్స్‌తో వారి సత్తా ఏంటో తెలుసుకునేందుకు బిగ్‌బాస్ ప్రయత్నించాడు. మొదటి రోజే ఇంటి సభ్యులను క్లాస్.. మాస్.. ట్రాష్ అంటూ మూడు భాగాలుగా విడిపోవాలని సూచించిన విషయం తెలిసిందే. క్లాస్ టీమ్‌కు విశేష అధికారాలుంటాయి. ఈ టీమ్‌లో బాలాదిత్య, శ్రీహాన్, సూర్య ఉన్నారు. ఇక మాస్ టీమ్‌లో రేవంత్, గీతూ, ఇనయ సుల్తాన ఉండగా.. ట్రాష్‌లోకి మిగిలినవారంతా ఉన్నారు. అయితే సమయానుసారం ఛాలెంజ్‌లు ఇస్తూ కంటెస్టెంట్లు టీమ్ మార్చుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించాడు. అలా తొలి ఛాలెంజ్ విన్ అయ్యి.. ఆదిరెడ్డి క్లాస్ టీమ్‌లో చేరిపోయాడు.
ఆదిరెడ్డి ప్లేస్‌లో శ్రీహాన్ వచ్చేసి ట్రాష్ టీమ్‌లో చేరిపోయాడు. ఆ తరువాతి రోజు అంటే నిన్న బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ట్రాష్ నుంచి ఒకరు క్లాస్ సభ్యుడితో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. అలా గీతూ క్లాస్ టీమ్‌లోకి ఎంటరవగా.. బాలాదిత్య ట్రాష్ టీమ్‌లోకి వచ్చి చేరాడు. ఆ తర్వాత ఇచ్చిన టాస్కుల్లో గెలిచిన రేవంత్, నేహా మాస్ టీమ్‌లోకి, బాలాదిత్య, అభినయ ట్రాష్‌లోకి వెళ్లారు. ఫైనల్‌గా ఈ క్లాస్.. మాస్.. ట్రాష్ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఫైనల్‌గా ట్రాష్ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ సుల్తానా ఈ వారం నేరుగా నామినేషన్‌లోకి వచ్చారు.
Biggboss 6 : మరికొందరిని ఎలాగైనా నామినేషన్స్‌లో పడేసే అవకాశం..
నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్ టీమ్‌లో ఉన్న కారణంగా ఈ ముగ్గురూ నామినేషన్స్‌లో లేరని ప్రకటించాడు బిగ్‌బాస్. అంతేకాదు, వీరు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కూడా ఉంది. ఇక మరి బిగ్‌బాస్ ఈ ముగ్గురితోనే నామినేషన్స్‌ని ముగించే అవకాశం లేదు కాబట్టి మరికొందరిని ఎలాగైనా నామినేషన్స్‌లో పడేస్తాడనంలో సందేహం లేదు. అయితే ఇప్పటి వరకూ చూసుకుంటే మాత్రం ఈ ముగ్గురిలో ఇనయ సుల్తానాకే బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బాలాదిత్య బాల నటుడుగా ఉన్నప్పటి నుంచి ప్రేక్షకులకు బాగా తెలుసు. కాబట్టి ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అభినయశ్రీ సైతం సుపరిచితురాలే. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఆమెకు నామినేషన్ గండం లేనట్టే. ఇక ఇనయ సుల్తానా. పెద్దగా ఎవరికీ తెలియదు. కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతగా లేదు. ఈ భామకే బయటకు వెళ్లే అవకాశం ఇప్పటి వరకైతే ఉంది. ఇక ముందు ఎవరైనా నామినేషన్స్‌లోకి వస్తే సీన్ మారే అవకాశం ఉంది.