Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. నిన్న రాత్రి జరిగిన కార్నివాల్‌లో నాగబాబు ఓ ఆసక్తికర విషయం చెప్పారు. చెన్నైలో జరిగిన విషయం. కానీ తెలియని విషయాలు కూడా చాలానే ఉన్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా.. ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు మీకోసం..
చిరంజీవి చేతి రాత అస్సలు బాగుండదట. కనీసం ఆయన రాసిన దాన్ని ఆయనే చదవలేరట. దీంతో సమయం దొరికినప్పుడల్లా చేతి రాతను మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటానని ఒకానొక సందర్భంలో చిరంజీవి చెప్పారు.
‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతక్కుండా వేసుకున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్ దాదాపు రెండేళ్ల పాటు జరిగింది. ఈ రెండేళ్ల పాటు చిరంజీవి వేసుకునే చొక్కా అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి మరుపురాని చిత్రమని కోడి రామకృష్ణ వెల్లడించారు.
రెండు బిరుదులు పొందిన అరుదైన హీరోలలో చిరంజీవి ఒకరు. తొలినాళ్లలో ‘సుప్రీమ్ హీరో’గా చిరుని పేర్కొనేవారు. ఆ తర్వాత ‘మెగాస్టార్’గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘మరణ మృదంగం’ సినిమాతో సుప్రీం హీరో కాస్తా.. మెగాస్టార్‌గా మారారు. ఈ చిత్ర నిర్మాత కేఎస్ రామారావు చిరుకి ఆ బిరుదు ఇచ్చారు.
ఇక ‘పసివాడి ప్రాణం’ చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్‌కు కూడా పెట్టింది పేరు. తొలినాళ్లలో ఆయన ఫైట్స్, డ్యాన్స్‌తోనే యూత్ మనసును గెలుచుకున్నారు.
Megastar Chiranjeevi : ఆగస్ట్ 22 ఎంత ప్రత్యేకమో.. సెప్టెంబర్ 22 కూడా అంతే స్పెషల్..
చిరంజీవికి తన బర్త్‌డే ఆగస్ట్ 22 ఎంత ప్రత్యేకమో.. సెప్టెంబర్ 22 కూడా అంతే స్పెషల్. ఎందుకంటే ఆయన నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది ఈ రోజే. 1978 సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌ని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా సైతం ‘ప్రాణం ఖరీదు’ కావడం విశేషం. అయితే చిరంజీవి నటింటిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినా.. ముందుగా ప్రాణం ఖరీదు విడులైంది.
‘రుద్రవీణ’లోని పాటలు చిరంజీవికి చాలా ఇష్టమట. చిరుకే కాదు ఆయన సతీమణి సురేఖకు కూడా ఈ పాటలే ఇష్టమట. ఈ సినిమాలోని ‘నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని’ అనే పాట అంటే తనకు చాలా ఇష్టమని గతంలో చిరంజీవి తెలిపారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల వైపు వెళ్లిన చిరంజీవి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమాతో తిరిగి ఫుల్ బిజీ హీరోగా కొనసాగుతున్నారు.