Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క. టాస్కులు ఆడకుండా కూర్చొని సొల్లు కబుర్లు చెబితే తాట తీస్తా అన్నట్టుగా బిగ్‌బాస్ నిన్ననే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.అరే.. బిగ్‌బాస్ ఒక టాస్క్ ఇస్తే ఆడాల్సింది పోయి.. కాస్ట్యూమ్స్ వేసుకుని ఒకడి వెంట తిరగడమే లక్ష్యంగా పెట్టుకుందో కంటెస్టెంట్. ఇంకొక ఆమె రెచ్చగొట్టి మరీ గొడవలు పెడుతోంది.ఇక వైఫ్ అండ్ హజ్బెండ్.. ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతారే కానీ టాస్క్ చుట్టూ తిరగరే.. మరొక కంటెస్టెంట్.. నేను వీక్ అని ఎలా చెబుతారంటూ గొడవకు దిగుతుంది. కానీ టాస్క్‌ల్లో ప్రూవ్ చేసుకోదే..
వీళ్లందరినీ చూసి అటు ప్రేక్షకులకు.. ఇటు బిగ్‌బాస్‌కు బీభత్సమైన చిరాకు వచ్చింది. అంతే అందరినీ బయటకు పిలిచి వరుసగా నిలబెట్టి మరీ కడిగి పారేశారు. టాస్కులు ఆడమని క్యారెక్టర్స్ ఇస్తే అందులో లూప్ హోల్స్ ఎక్కడున్నాయా? అని వెతుక్కుంటారు తప్ప చెప్పింది చెప్పినట్టు చెయ్యరు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.. ఆట అంతకన్నా లేదు. రోజు రోజుకూ నిరాశాజనకంగా తయారవుతోంది. దీంతో ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడో ఏమో కానీ ఇంట్లో ఉంటే ఉండండి.. పోతే పోండి.. అంటూ మాంచి డోస్ ఇచ్చాడు. దీంతో ఒక్కొక్కరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.
ఇక ఇవాళ ప్రోమో చేస్తే ఒక్కొక్కరికీ వేరే లెవల్‌లో పనిష్మెంట్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇంట్లో దొంగలు పడ్డారు. వారు వండుకున్న దాచుకున్న ఫుడ్ అంతా తీసుకెళ్లిపోయారు. ఇక నుంచి పోరాడి ఫుడ్ సాధించుకోవాలంటూ బిగ్‌బాస్ రూల్ పెట్టాడు. కబడ్డి ఆడించాడు. ఈ కబడ్డి చాలా బాగా ఆడినట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకూ సరిగా ఆసక్తి కనబరచని వాళ్లు కూడా ఈ రోజు బాగా ఆడారు. ఇక ఈ కబడ్డీలో సూర్య టీమ్ గెలిచి ఫుడ్ సంపాదించినట్టు తెలుస్తోంది. మరి వేరే టీమ్ పరిస్థితి ఏంటి? వారికి ఏమైనా టాస్క్ ఇచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ కబడ్డీ ఆడటానికి ముందు ఫుడ్ కోసం కంటెస్టెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు.తిండి కోసం విలవిల్లాడిపోయారు.