Biggboss 6 : అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ సీజన్ 6 నిన్న ప్రారంభమైంది. హౌస్ లోకి 21 మంది కంటిస్టెంట్‌లని కింగ్ నాగార్జున పంపించారు. వీరిలో కొంత మంది తెలిసిన ముఖాలు ఉన్నా మరి కొంత మంది మాత్రం కొత్తవాళ్లు ఉన్నారు. ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసి బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నవారే కావడం విశేషం. వారిలో రాజశేఖర్, అర్జున్ కళ్యాణ్, ఆరోహిరావు, ఇనయా సుల్తానా, శ్రీహాన్ లాంటివారు ఉన్నారు. వీరితో పాటు ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ గ్రాండ్‌గా తనని తనకు పరిచయం చేసుకోవాలని అనుకుంటున్న అభినయశ్రీ షోకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక రియల్ కపుల్ రోహిత్- మెరీనా సైతం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు షోపై పూర్తి అవగాహనతో ఎంట్రీ ఇచ్చారు.
బిగ్‌బాస్‌ను ప్రతి క్షణం ఫాలో అయ్యేవారు ఎవరైనా ఉన్నారంటే.. వారు రివ్యూవర్స్. అలా రివ్యూలు ఇచ్చి ఇచ్చి పాపులర్ అయిపోయి ఇద్దరు వ్యక్తులు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. వారిలో ఒకరు ఆదిరెడ్డి అయితే.. మరొకరు గీతూ రాయల్. ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ అలియాస్ గలాటా గీతు ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ షోకి రావడానికి గల కారణాలను గీతూ చెప్పుకొచ్చింది. అవి.. ‘‘చిన్నప్పటి నుంచి చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. నా బాడీ అంటే నాకు ఇష్టం లేదు. లావుగా ఉన్నానని ఆపరేషన్ చేయించుకొని నెక్ట్స్ సీజన్‌కి వద్దామనుకున్నా. కానీ నా ఫ్రెండ్స్ సపోర్ట్‌తో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చేశా. నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చా. గతంలో బిగ్‌బాస్ షోపై రివ్యూలు ఇచ్చేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను బిగ్‌బాస్‌లోకి వస్తే నాపై ఎలాంటి రివ్యూలు ఇస్తారు? అసలు నేను ఇక్కడ ఎలా ఉండగలను అని నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చా. నేను ఇదే స్టేజ్‌పై టాప్-5లో ఉండి ఏదైనా సాధిస్తే ఆరోజు నా మూడో రీజన్ చెబుతా’’ అని గీతూ చెప్పుకొచ్చింది.
Biggboss 6 : ఆ వీడియో పాపులర్ అయ్యింది..
ఇక ఆదిరెడ్డి.. బిగ్‌బాస్ రివ్యూస్ ఇవ్వడంలో దిట్ట. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. 17వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. నెల్లూరులో ఉదయగిరిలోని వరికుంటపాడు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఫ్రెండ్ సలహాతో ఓసారి సరదాగా బిగ్‌బాస్ సీజన్-2పై రివ్యూ ఇస్తూ ఓ వీడియోను నెట్టింట అప్‌లోడ్ చేయగా ఆ వీడియో పాపులర్ అయ్యింది. దీంతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి బిగ్‌బాస్ షోలపై తనదైన విశ్లేషణతో గుర్తింపు పొందాడు. మరి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఆదిరెడ్డి బిగ్‌బాస్ షోలో ఎలా అలరిస్తాడో చూద్దాం.