రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదా? 50 ఏళ్ల హీరో కూడా 20 ఏళ్ల హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లు చేయొచ్చా? ఇదే విషయం నవాజుద్దీన్ సిద్దిఖీని అడిగితే అవుననే అంటున్నాడు. అసలు రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు.. అయినా ఈ కాలం హీరోలు అసలు రొమాన్స్ కు పనికి రారు అని నవాజ్ అనడం విశేషం.
నవాజుద్దీన్ నటించిన టీకూ వెడ్స్ షేరూ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నిర్మించింది. ఈ మధ్యే సినిమా టీజర్ రిలీజ్ కాగా.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందులో నవాజ్, అవనీత్ కౌర్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది. 49 ఏళ్ల నవాజ్, 21 ఏళ్ల అవనీత్ లిప్ లాక్ ఏంటి అసహ్యంగా అంటూ కొందరు అభిమానులు హేళన చేశారు.

అయితే ఈ ట్రోల్స్ కు నవాజుద్దీన్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. “రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు. వాట్సాప్ లోనే లవ్ చేసి, బ్రేకప్ చెప్పుకుంటున్న కాలం ఇది. మేము రొమాన్స్ కాలానికి చెందిన వాళ్లం. స్క్రీన్ పై ఇప్పటికీ రొమాన్స్ చేయగలం. ఇప్పటికీ షారుక్ ఖాన్ రొమాన్స్ విషయంలో అంత బాగా ఎలా చేయగలుగుతున్నాడు? ఎందుకంటే యువ హీరోలు, ఈ జనరేషన్ ఈ విషయంలో పనికి రారు” అని నవాజ్ అన్నాడు.