Biggboss 6 : బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక కొద్ది రోజుల పాటు రచ్చ రంబోలా గానే ఉంటుంది. ఇక బిగ్‌బాస్ ఊరుకుంటాడా? హౌస్‌లోకి వెళ్లిన వాళ్లకి తొలిరోజే చుక్కలు చూపించాడు. 21 మందిని జైలు మాదిరిగా ఉన్న ఓ గదిలో పడేసి.. కేవలం 8 బెడ్లు మాత్రమే ఇచ్చారు. బెడ్లు దొరక్క చాలామంది కంటెస్టెంట్లు ఇబ్బందిపడ్డారు. క్లాస్, మాస్, ట్రాష్ అంటూ ఒక మూడు గ్రూపులుగా వాళ్లనే డివైడ్ కావాలని చెప్పి కంటెస్టెంట్స్ మధ్య పెద్ద గొడవే పెట్టాడు మన బిగ్‌బాస్ నారదముని. ట్రాష్ అన్నవాళ్లు నామినేట్ అవుతారని తొలివారం నామినేషన్‌కి నైస్‌గా తెరదీశాడు.
మొత్తానికి చూడబోతే తొలి వారం ఎక్కువ మంది గలాటా గీతూనే నామినేట్ చేసేలా ఉన్నారు. ఇక గీతు రాయల్‌కి ఇనయ సుల్తానాకి చిన్న గొడవ జరిగింది కాబట్టి ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. బాలాదిత్య.. చలాకీ చంటిని నామినేట్ చేశాడు. ఇక తొలివారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవాళ్లు నామినేషన్స్‌లోకి వస్తే మాత్రం.. సింగర్ రేవంత్, శ్రీహాన్, ఆర్జే సూర్య, చలాకీ చంటి, ఫైమా ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు పక్కాగా.. ఇనయ సుల్తానా, గీతు రాయల్‌లు ట్రాష్ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉంటారు. అలాగే షానీ కూడా నామినేషన్స్‌లో ఉండే అవకాశం ఉంది.
Biggboss 6 : నువ్వు కూడా సెలబ్రిటీవేనా?
హౌస్ లోపలికి వెళ్లిన తరువాత ఇద్దరు హౌస్ మేట్స్‌తో ‘నీ క్యాస్ట్యూమ్స్ బాగుంది కానీ నీకు సూట్ కాలేదు’ అని.. ‘నువ్వు కూడా సెలబ్రిటీవేనా?’? అని అనాలి.. అలాగే.. నీ దగ్గర ఓ కంటెస్టెంట్ మూడు లక్షలు అప్పు తీసుకున్నట్టు నమ్మించాలి అని ఈ మూడు టాస్క్‌లు ఇచ్చారు. మూడోది పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు కానీ.. ఎవర్నైనా నీ డ్రెస్ బాగుంది కానీ.. నీకు సూట్ కాలేదంటే ఎలా ఉంటుంది? అలాగే నువ్వూ ఓ సెలబ్రిటీవేనా? అని అంటే ఫీల్ కాకుండా ఉంటారా? మొత్తానికి షానీని కూడా నామినేషన్స్‌లోకి లాగేయడం ఖాయం. వీరితో పాటు ఇంకెవరు నామినేషన్స్‌లో ఉంటారు? ఎవరికి ఎవరితో పడనుంది? విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.