BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో గీతూ హవా కొనసాగుతోందనే చెప్పాలి. తనదైన చిత్తూరు యాసతో బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిపారేస్తోంది. ఎక్కడా తగ్గకుండా తన ప్రదర్శనను చూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఎప్పుడు ఎలా గేమ్ ఆడాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి… ఎవరితో గొడవ పడాలి… ఎవరితో సంధి కుదుర్చుకుని అవసరం మేరకు అడ్జెస్ట్ అవ్వాలి అనేది గీతూకి బాగా తెలుసు.
ఇక ఈ వారం గీతూకి బిగ్ బాస్ కి మధ్య ఫన్నీ సన్నీవేశం సాగింది. మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ తన బర్త్ డే సందర్భంగా తనను ఎంటర్ టైన్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చెప్తాడు. ఇందులో భాగంగా గీతూతో బిగ్ బాస్ సింగల్ గా ఓ రూంలో మాట్లాడతాడు. చాలా సేపు వీరిద్దరూ ముచ్చటించుకోవడం ఈ ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేగా మీ డౌట్… అక్కడికే వస్తున్నా….!

గీతూ బిగ్ బాస్ సూచనల మేరకు సీక్రెట్ రూంలోకి వెళ్తుంది. అక్కడ ఓ బౌల్ లో చికెన్ పీసులు ఉంటాయి. అది తినడానికి అర్హత లభించాలంటే ఇంటి సభ్యుల గురించి ఆసక్తికరమైన గాసిప్స్ చెప్పమని బిగ్ బాస్ గీతూని అడుగుతాడు. కీర్తిపైన అందరూ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు.. అంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంది.. కెప్టెన్ అయ్యాక భయంకరమైన బాస్ లా ప్రవర్తిస్తోంది అది ఎవరూ తీసుకోలేక పోతున్నారు. ఆ పిల్లకి ఈసారి ఫుల్ నామినేషన్స్ ఉంటాయి నాకు తెలిసి అని గీతూ తనదైన శైలిలో చెప్తుంది. ఈ గాసిప్ తో మీరు చికెన్ ని వాసన చూడవచ్చు అని బిగ్ బాస్ ఫన్ చేస్తాడు.
సూర్య, ఇనయ మధ్యలో ఏదో.. అంటే సూర్యకి ఆ పిల్లమీద ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలీదు.. సూర్య నార్మల్ గానే ఉన్నాడు కానీ, ఇనయ సైడ్ నుండి యాడో కొంచెం రగులుతోంది మొదలు పగలా కనిపిస్తోంది బిగ్ బాస్ అని చెప్తుంది. ఇక సత్యను భయకరంగా గోకేదానికి ట్రై చేస్తున్నాడు అర్జున్. అది ఎందుకు చేస్తున్నాడో తెలీదు. శ్రీహాన్, సత్య డ్యాన్స్ వేసినప్పుడు అర్జున్ మూతి మాడిపోయిందని గీతూ చెప్తుంది. మాట్లాడి అలిసిపోయినట్లున్నావు చికెన్ తిను అని చెప్తాడు బిగ్ బాస్. చికెన్ తింటూ బిగ్ బాస్ కి ముచ్చట్లు చెప్తుంది. తర్వాత గీతూని బిగ్ బాస్ బయటికి వెళ్లమని చెప్తాడు. బయటికి వెళ్లి అందరికీ చూపించుకుంటూ వెక్కిరిస్తూ చికెన్ తింటుంది గీతూ.