Biggboss 6 : బిగ్ బాస్ సీజన్ 6.. ఫస్ట్ డే మంచి రంజుగానే సాగుతోంది. ఒకవైపు గలాటా గీతూ.. మరోవైపు రేవంత్ కావల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. ఇక మిగిలిన వారిలో ఆరోహి, బాలాదిత్య ఇప్పటి వరకూ కాస్త హైలైట్ అవుతున్నారు. మిగిలిన వాళ్లకైతే పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకడం లేదు. ఈసారి వెరైటీ ఏంటంటే.. కొత్త ముఖాలనుకున్నవాళ్లు కెమెరాల్లో పడటానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక తొలివారానికి సంబంధించిన నామినేషన్స్ కంప్లీట్ కాగా.. ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక కెప్టెన్ విషయానికి వస్తే.. మన పెదరాయుడు అదేనండీ.. బాలదిత్య తొలి కెప్టెన్ అయ్యాడు.
అన్ సీన్ ఎపిసోడ్‌లో ఈ కెప్టెన్సీ టాస్క్ ముగియడమే కాదు.. జైలు పంచాయితీలు కూడా ముగిశాయి. కెప్టెన్ పోటీదారులుగా ఉన్న కంటెస్టెంట్స్‌కి కెప్టెన్సీ బండి అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కి ఫైమాని సంచాలక్‌గా నియమించారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రేవంత్, ఆరోహి, చాందిని చౌదరి, ఆర్జే సూర్య, మెరీనా, గీతు, రోహిత్‌లు కెప్టెన్ పోరులో నిలవగా.. ఆదిరెడ్డి, బాలాదిత్యల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి బాలాదిత్య బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు.దీని కంటిన్యూషన్‌లోనే ఎవరు బెస్ట్ కంటెస్టెంట్? ఎవరు వరస్ట్ కంటెస్టెంట్? అనేది చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో ఆ చర్చ నడిచింది.
Biggboss 6 : కెప్టెన్సీ బాధ్యతలను ఎవరినీ నొప్పించకుండా చేస్తాడా?
మొత్తమ్మీద గలాటా గీతూని ఏకాభిప్రాయంతో వరస్ట్ కంటెస్టెంట్‌గా తేల్చారు. దీంతో ఆమెను జైలులో వేశారు. ప్రతి ఒక్కరిపై నోరు వేసుకుని పడిపోయి వరస్ట్ కంటెస్టెంట్‌గా మారిపోయింది గీతూ. మరి అక్కడైనా ప్రశాంతంగా ఉంటుందో.. లేదంటే జైలు నుంచి కూడా గలాటా మొదలు పెడుతుందో చూడాలి. ఇక బాలాదిత్య కెప్టెన్సీ ఎలా ఉంటుందనేది రేపటి నుంచి తెలుస్తుంది. ఇప్పటి వరకూ బాలాదిత్య అందరి చేత.. బయట కూడా ది బెస్ట్ అనే అనిపించుకుంటున్నాడు. కానీ కెప్టెన్సీ అంటేనే కాస్త చికాకుతో కూడుకున్న వ్యవహారం. మరి ఇప్పటి వరకూ నొప్పించనట్టే.. ఇక ఈ కెప్టెన్సీ బాధ్యతలను కూడా నొప్పించకుండా చేస్తాడో లేదో చూడాలి.