Anasuya : ఎందుకనో గానీ.. బుల్లితెర స్టార్ యాంకర్, వెండితెర నటి అనసూయ భరద్వాజ్ స్టామినాను కొందరు నెటిజన్లు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అమ్మడికి ఫాలోయింగ్ మాటేమో కానీ సోషల్ మీడియాలో నెగిటివిటీ మాత్రం బీభత్సం. అనసూయను ట్రోల్ చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆంటీ అంటూ ఆమెను ఆ మధ్య కొందరు నెటిజన్స్ బాగా ఆడుకున్నారు. చివరకు ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధించడం మొదలు పెట్టాడు.
దీనిపై అనసూయ కొద్ది రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం కొందరు నెటిజన్లకు తెలియలేదు. దీనిపై ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా నిర్వహించారు. దీనిని తాజాగా అనసూయ షేర్ చేసింది. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా పవిత్ర లోకేష్.. నరేష్ మూడో భార్యపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఇమేజ్‌ను రమ్య నరేష్.. డ్యామేజ్ చేస్తోందంటూ పవిత్ర లోకేష్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిని ప్రస్తావిస్తూ.. అనసూయ స్టామినాను లెక్కగట్టాడో నెటిజన్. ఇద్దరి మధ్య ట్విటర్ వేదికగా జరిగిన కాన్వర్సేషన్‌ను అనసూయ ట్విటర్‌లో రీట్వీట్ చేసింది.
నెటిజన్ ఒకరు ‘‘ట్విట్టర్ ఐడీలు కేస్ సెన్సిటివా’’ అని ట్వీట్ చేశాడు. దీనికి మరో నెటిజన్ రిప్లైగా పవిత్రా లోకేష్ కేసును ప్రస్తావించాడు. వాళ్ల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో హీరోయిన్లను ట్రోల్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తున్నారంట.. అని పేర్కొనగా.. అవును అనసూయ కూడా మార్ఫింగ్ చేస్తున్నారని కంప్లయింట్ ఇస్తే అరెస్ట్ చేశారంట అని ఇద్దరిలో ఒక నెటిజన్ రిప్లై ఇచ్చాడు. దీనికి మొదట రిప్లై ఇచ్చిన నెటిజన్ మరింత ఆసక్తికరంగా స్పందించాడు. ‘‘అనసూయకు అంతలేదులే. నరేష్ అంటే బిగ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా’’ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ను అనసూయ రీట్వీట్ చేశారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 27, 2022