Bigg Boss 6: బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఇచ్చే ప్రతి ఆదేశాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం హౌస్ లో రెండో వారం కెప్టెన్సీ టాస్క్ ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే పోటీదారులుగా నలుగురు సెలెక్ట్ అయ్యారు. వీరిలో ఎవరు కెప్టెన్ అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది. ఇదిలా ఉంటే రెండో ఛాలెంజింగ్ టాస్క్ ఆడుతున్న సమయంలో సుదీప, ఫైమా తమ బొమ్మల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వెంటనే చాకచక్యంగా అభినయశ్రీ… ఫైమా బొమ్మని ఇంకా సుదీపా బొమ్మని శ్రీ సత్య తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ జోన్ లో వేసేసి ఇద్దరినీ కెప్టెన్ పోటీదారులు కాకుండా అనర్హులుగా చేశారు.
అప్పటికే టాస్క్ ఓడిపోయిన ఫైమా… తన బొమ్మ లాస్ట్ అండ్ ఫౌండ్ జోన్ లో వేసేయడంతో కన్నీరు పెట్టుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల అనుసారంగానే అభినయశ్రీ, శ్రీ సత్య వారి బొమ్మలను పట్టుకున్నారు. ఈ రకంగా వేరే వాళ్ళ బొమ్మలను పట్టుకోవడంలో సిసింద్రీ టాస్క్ లో.. గీతు రాయల్ దూసుకుపోయింది. హౌస్ లో దాదాపు నలుగురు బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్ జోన్ లో వేసేసి అనర్హులుగా చేసేసింది.
చాలావరకు గీతు ఆడిన గేమ్ కారణంగానే రెండో వారం బిగ్ బాస్ హౌస్ షో చూడటానికి చాలా రసవత్తరంగా హౌస్ లో వాతావరణం క్రియేట్ అయింది. ఒకపక్క బిగ్ బాస్ ఆదేశాలను పాటిస్తు మరోపక్క స్ట్రాటజీలు వేయడంలో గీతు రాయల్ ఆరితేరిపోయింది. ఎక్కడ కూడా తగ్గేదేలే అనే రీతిలో అటాకింగ్ గేమ్ ఆడుతూ షో చూడటానికి ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!