KTR: మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన విషయాలలో చాలావరకు స్పందిస్తూ ఉంటారు. ఈ తరహాలోనే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన అనే అమ్మాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ తర్వాత స్థానిక బాలసదనంలో జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసఫ్ గూడ లోని స్టేట్ హోంలో… పాలిటెక్నిక్ పూర్తి చేయడం జరిగింది. అనంతరం ఈసెట్ ద్వారా హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన ఇంజనీరింగ్ కాలేజ్ లో సిబిఐటిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేకపోవడంతో ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించటం రుద్ర రచనకు చాలా భారమైపోయింది.
ఈ క్రమంలో 2019వ సంవత్సరంలో రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్.. ఆ టైంలోనే ఆమెను ప్రగతి భవన్ కి పిలిపించుకుని ఆమె చదువు పూర్తి అయ్యేంతవరకు ఖర్చులు మొత్తం తానే భరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్రారచన ఇంజనీరింగ్ ఫీజు మరియు హాస్టల్.. రీజన్ కూడా గత కొన్ని సంవత్సరాల నుండి కేటీఆర్ వ్యక్తిగతంగా కడుతూ వస్తున్నారు. రుద్రారచన ఇప్పుడు చివరి సంవత్సరం కావడంతో ఇటీవల ఏకంగా నాలుగు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగం సంపాదించింది. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో… రుద్ర రచనకు ఏకంగా నాలుగు ఉద్యోగాలు రావడంతో… ఈ విషయాన్ని కేటీఆర్ కి తెలియజేయడానికి ఆమె ఈరోజు కలిసింది. ప్రగతి భవన్ లో కేటీఆర్ రుద్రారచన ఉద్యోగం సంపాదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమె.. డ్రీమ్ సివిల్ సర్వీస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న దానికి కూడా పూర్తిగా అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో తల్లిదండ్రులు లేని తనకు కేటీఆర్ ఒక అన్నగా అండగా నిలబడ్డారని భావోద్వేగంతో రచన మాట్లాడింది. తన కల సాకారం చేయటం కోసం తండ్రిగా తపించారని భావోద్వేగానికి గురైంది. ఈ ఏడాది రాఖి కట్టాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో కేటీఆర్ కాలికి గాయం అయిందని తెలుసుకొని బాధపడ్డా. కానీ నేను పొదుపు చేసుకున్న డబ్బులతో గిఫ్ట్ గా వెండి రాఖి తయారు చేయించాను అని చెప్పి కేటీఆర్ చేతికి.. రచన రాఖీ కట్టడం జరిగింది. కేటీఆర్ రచన మాటలకు భావోద్వేగానికి గురయ్యారు. రాబోయే రోజుల్లో మరింత స్థిరపడేందుకు రుద్రకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. రుద్ర జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొనీ నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించి.. యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది అని అన్నారు.